అనిల్ రావిపూడికి "మెగా బోనస్" ఇచ్చిన చిరంజీవి..!

Pandrala Sravanthi
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ హీరోలలో ఈయన కూడా ఒకరు.. ఇప్పటికీ ఏడు పదుల వయస్సు దాటినా కానీ వరుస సినిమాలతో సినీ ఇండస్ట్రీ లో దూసుకు వెళ్తున్నారు. అలాంటి చిరంజీవి హీరోగా చేసిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు.. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాకి అనిల్ రావిపూడి డైరెక్షన్ చేశారు.. అయితే సక్సెస్ఫుల్ డైరెక్టుగా పేరుపొందిన ఈ దర్శకుడికి సినిమా సక్సెస్ సందర్భంగా చిరంజీవి మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు.. అనిల్ నాకు, వెంకటేష్ కు కలిపి ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చెయ్.. 


మేమిద్దరం కలిసి చిత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చిరంజీవి చెప్పడంతో మెగా అభిమానులు, మరో వైపు దగ్గుబాటి వెంకటేశ్ అభిమానులంతా సంబర పడిపోతున్నారు. ఇద్దరు స్టార్ హీరోల కాంబో లో సినిమా వస్తుంది అంటే ఊహలకందని విధంగా అంచనాలు ఉంటాయని సినీ ప్రేక్షకులు ఆలోచన చేస్తున్నారు. అంతేకాదు వెంకటేష్ సినిమాలో నేను గెస్ట్ రోల్ చేయడానికి అయినా సిద్ధమే లేదంటే ఇద్దరికి సమానమైన లెన్త్ పాత్రలు ఇచ్చిన చేస్తానంటూ మెగాస్టార్ చిరంజీవి ఒప్పుకున్నారు.. అంతేకాదు సినిమా ఎప్పుడు చేద్దాం అన్నా నేను రెడీ అంటూ చెప్పుకొచ్చారు.. అలాగే వెంకటేష్ కూడా చిరంజీవితో సినిమా అంటే నేను కూడా ఎప్పుడైనా రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..


 ఒకే వేదికపై ఇద్దరు ఒకేసారి అనిల్ రావిపూడి కి బంపర్ ఆఫర్ ఇవ్వడంతో అనిల్ రావిపూడి కి సంక్రాంతికి మెగా బోనస్ లభించిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనప్పటికీ చిరంజీవి, వెంకటేష్ కాంబోలో సినిమా అంటే  అభిమానులకు ఎంతో సంబరాన్ని అందిస్తుందని అంటున్నారు.. మరి చూడాలి వీరి కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుంది.. ఎలాంటి కథతో వస్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: