బుగ్గన-గుమ్మనూరు కోటలు కూలనున్నాయా?
ఈ క్రమంలోనే పలు కంచుకోటలు ఈ సారి బద్దలయ్యేలా ఉన్నాయి...ముఖ్యంగా జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల కోటలో బద్దలగొట్టాలని టీడీపీ చూస్తుంది..కర్నూలు జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్న విషయం తెలిసిందే..బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాంలు మంత్రులుగా ఉన్నారు..గత రెండు ఎన్నికల్లో వీరు గెలుస్తూ వస్తున్నారు. బుగ్గన ఏమో డోన్ నుంచి, జయరాం..ఆలూరు నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
కానీ ఇద్దరు మంత్రులకు హ్యాట్రిక్ ఛాన్స్ ఇవ్వకూడదని టీడీపీ చూస్తుంది..ఆ దిశగానే పనిచేస్తుంది. ఇప్పటికే ఆలూరులో టీడీపీ దూకుడుగా ఉంది...ఇక్కడ కోట్ల సుజాతమ్మ టీడీపీని నడిపిస్తున్నారు...ఇప్పటికే ఆమె లీడ్ లోకి వచ్చినట్లు కనిపిస్తున్నారు...పైగా జయరాంపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తోంది..అలాగే ఈయనపై ఎన్ని రకాల ఆరోపణలు వచ్చాయో అందరికీ తెలిసిందే...భూ కబ్జాలు, బెంజ్ కారు లంచం, పేకాట క్లబ్బులు నడపటం, ఇసుక అక్రమాలు...ఇలా అనేక ఆరోపణలు వచ్చాయి...ఇవన్నీ జయరాంకు నెగిటివ్ అవుతున్నాయి...ఇవే టీడీపీకి ప్లస్..అందుకే ఈ సారి జయరాం గెలుపు ఈజీ కాదనే చెప్పాలి.
అటు డోన్ లో కూడా బుగ్గన గెలుపు సులువు కాదనే అనిపిస్తోంది...వరుసగా రెండు సార్లు భారీ మెజారిటీలతో గెలిచారు గాని...అంతే భారీగా డోన్ ప్రజలకు బుగ్గన పెద్దగా ఏమి చేయలేదు..ఆర్ధిక మంత్రిగా ఉన్నా సరే డోన్ లో అభివృద్ధి పెద్దగా లేదు..ఈ పరిణామాలు బుగ్గనకు బాగా మైనస్ అవుతున్నాయి..అటు టీడీపీ నేత సుబ్బారెడ్డి దూకుడుగా ఉన్నారు...బుగ్గనపై పైచేయి సాధించాలని చూస్తున్నారు. మరి చూడాలి ఈ సారి మంత్రుల కోటలు కూలతాయో లేదో.