వామ్మో.. చెర్రి పాటకు డ్యాన్స్ అదరగొట్టిన వైసీపి నేత..

Satvika
ఈ మధ్య పోలిటికల్ లీడర్స్ ఈ మధ్య సినిమా పాటలకు డ్యాన్స్ లు వేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు.  రాజకియాలను మాత్రమే కాదు.. పాటలకు అదిరిపొయె స్టెప్పులు కూడా వేస్తున్నారు.. మిగిలిన పార్టీల నేతలు ఒకవైపు, అధికార పార్టీ నేతలు మాత్రం రచ్చ చేస్తున్నారు.. వారి అభిమాన హీరో పాటలకు స్టెప్పులు వేస్తూ అందుకు సంబంధించిన వీడియో లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఆ వీడియోలను చూసిన జనాలు కూడా వారెవ్వా అంటూ కామెంట్స్ చేస్తున్నారు..


ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు మరో లీడర్ కూడా పాటకు అదిరిపొయె డ్యాన్స్ లు వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త ట్రెండ్ అవుతుంది.. విషయాన్నికొస్తే..బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి.. ఈ పేరు అందరికి తెలిసే ఉంటుంది. ఏపీలో మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్న వైసీపీ యువనేత. రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో బాగా ఫేమస్ అయ్యాడు.. అతను పేరు వినగానే యువత చాలా బాగా ఇంస్పైర్ అవుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారు. మంచి మాటలతో అతి తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్నాడు సిద్దార్థ్. తక్కువ వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలిపేందుకు అహర్నిశలు కృషిచేశారు. సీఎం జగన్ ప్రేమ చూరగొని.. శాప్ చైర్మన్ అయ్యాడు. కాగా సిద్దార్థ మాట్లాడిన ఇంటర్వ్యూలు, వీడియోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటాయి. అందుకే అతని పేరు రాజకీయాల్లొ ఎక్కువ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సిద్దార్థ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అందులో రామ్ చరణ్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు బైరెడ్డి.ఇది అతను టీనేజ్‌లో ఉన్నప్పుడు చిత్రీకరించిందిగా తెలుస్తుంది. ఎప్పుడు పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసే బైరెడ్డిలోని ఈ టాలెంట్ చూసి కొందరు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: