విశాఖలో హోరాహోరీ..జనసేనతో రిస్క్?

M N Amaleswara rao
ఏపీలో బాగా హాట్ హాట్ రాజకీయాలు కృష్ణా, గుంటూరు లాంటి జిల్లాల్లో నడుస్తూ ఉంటాయనే సంగతి తెలిసిందే...రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఈ రెండు జిల్లాల కేంద్రంగానే రాజకీయాలు నడుస్తున్నాయి..రాజధాని అమరావతి ప్రాంతం ఈ రెండు జిల్లాల మధ్యలోనే ఉండటంతో..ఇక్కడ నుంచే పార్టీలు రాజకీయం చేస్తున్నాయి..అందుకే ఎప్పుడు ఈ రెండు జిల్లాల్లో పోరు నువ్వా-నేనా అన్నట్లే ఉంటుంది.

అయితే ఈ సారి విశాఖ కేంద్రంగా రాజకీయ యుద్ధం గట్టిగా నడిచేలా ఉంది...విశాఖ కేంద్రంగా హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది..ఎందుకంటే జగన్ మూడు రాజధానులు ప్రకటించడం...అందులోనూ విశాఖని కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని చూసిన దగ్గర నుంచి విశాఖలో రాజకీయం మారిపోయింది. పైగా ఈ సారి జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తోనే ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు. అంటే అప్పుడు విశాఖపట్నంలో వైసీపీ అద్భుత విజయం సాధించాలి.

గత ఎన్నికల్లో ఎలాగో విశాఖలో వైసీపీనే పైచేయి సాధించింది...జిల్లాలో 15 సీట్లు ఉంటే వైసీపీ 11, టీడీపీ 4 సీట్లు గెలుచుకుంది...మరి ఈ సారి కూడా విశాఖలో వైసీపీ పైచేయి సాధిస్తుందా? విశాఖ రాజధాని కాన్సెప్ట్ వైసీపీకి కలిసొస్తుందా? అంటే ఇప్పుడే ఏమి చెప్పలేమని చెప్పొచ్చు...ఎందుకంటే ఇప్పుడున్న పరిస్తితుల్లో విశాఖలో వైసీపీకి అంత అనుకూల పరిస్తితులు ఏమి కనిపించడం లేదు..ఏదో అధికారం ఉంది కాబట్టి...ఆ బలం వల్ల కాస్త పైచేయిలో ఉంది గాని...క్షేత్ర స్థాయిలో వైసీపీ వీక్ అవుతుంది..టీడీపీ స్ట్రాంగ్ అవుతుంది...అంటే విశాఖలో హోరాహోరీ పోరు ఉండేలా ఉంది.

అదే సమయంలో జనసేన ఇక్కడ కీ రోల్ పోషిస్తుంది..నెక్స్ట్ ఎన్నికల్లో జనసేన గాని విడిగా పోటీ చేస్తే...వైసీపీకి బాగా కలిసొస్తుంది...ఓట్లు చీలిపోవడం వల్ల వైసీపీకి ప్లస్ అవుతుంది...గత ఎన్నికల్లో అదే జరిగింది. అలా కాకుండా టీడీపీతో గాని జనసేన కలిస్తే...విశాఖలో వైసీపీకి చుక్కలే..టీడీపీ-జనసేన పార్టీలు కలిసి మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటాయి...అంటే విశాఖలో ఫలితాలని తారుమారు చేసే శక్తి జనసేనకు ఉందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: