అమ్మాయిల అర్ధనగ్న ప్రదర్శన.. ఎందుకంటే..!

NAGARJUNA NAKKA
ఉక్రెయిన్ పై యుద్ధం ఆపాలంటూ రష్యాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచుతున్నాయి. లక్షలాది మంది ప్రజలు తమ నిరసన తెలుపుతున్నారు. తాజాగా స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో ఫిమెన్ అనే మహిళా సంఘం వాలంటీర్లు రష్యా ఎంబసీ దగ్గర అర్ధనగ్న ప్రదర్శనతో ఆందోళన చేశారు. తమ పైదుస్తులు విప్పి ఛాతిపై.. పుతిన్ యుద్ధాన్ని ఆపు అంటూ డిమాండ్ చేశారు. గతంలో సెక్స్ టూరిజంకు వ్యతిరేకంగా ఈ వాలంటీర్లు ఇదే తరహా నిరసన తెలియజేశారు.

అటు రష్యాకు బెలాసర్ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ పై యుద్ధానికి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది. తమ భూభాగం నుంచి ఉక్రెయిన్ పై దాడులు చేసేందుకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు వాణిజ్యపరంగానూ రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జపాన్ కు చెందిన దిగ్గజ కంపెనీ పానసోనిక్.. రష్యాతో వాణిజ్య సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించింది.

ఇక ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సొంత దేశంలోనే మద్ధతు దక్కడం లేదు. ఈ దాడులను కవర్ చేస్తూ వ్యతిరేక వార్తలు రాస్తున్న మీడియాపై రష్యన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో టీవీ రెయిన్ అనే ఛానల్ సిబ్బంది లైవ్ లోనే రాజీనామా చేసి స్టూడియో నుంచి వాకౌట్ చేశారు. నో టు వార్ అంటూ నినాదాలు చేశారు. యుద్ధం ఆగిన తర్వాత తమ కార్యకలాపాలు ప్రారంభింస్తామని యాజమాన్యం ప్రకటించింది.

మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ఆపేలా భారత్ చర్చలకు ఒప్పించాలని మన దేశంలో ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ సూచించారు. భారత్-రష్యా మధ్య సంబంధాలు బాగున్నాయని తెలిపారు. భారత్ శక్తిమంతమైన దేశమనీ.. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందేనన్నారు. తమ పౌరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి దేశంపైనా ఉంటుందని చెప్పారు. అలాగే భారత్ కు కూడా ఉక్రెయిన్ లోని భారతీయులను కాపాడుకోవడం తొలి ప్రాధాన్యత అవుతుందన్నారు.

ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యాపై విచారణకు అంతర్జాతీయ స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలన్న తీర్మానంపై యూఎన్ఓ మానవ హక్కుల మండలిలో నిర్వహించిన ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. 42సభ్య దేశాలు ఉన్న మండలిలో 32అనుకూలంగా ఓటెయ్యగా.. రష్యా, ఎరిట్రియా వ్యతిరేకంగా ఓటేశాయి. భారత్, చైనా, పాకిస్తాన్ సహా 13దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. ఇప్పటికే రష్యాకు వ్యతిరేకంగా నిర్వహించిన 2ఓటింగ్ లకు భారత్ దూరంగా ఉంది.













మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: