హై కోర్ట్ తీర్పు: ఏపీ ప్రభుత్వంపై చెలరేగిన చంద్రబాబు...
కాగా తాజాగా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సైతం ఈ విషయంపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. అయన మాట్లాడుతూ హై కోర్ట్ తీర్పును టీడీపీ స్వాగతిస్తోంది అన్నారు. టీడీపీ ప్రభుత్వం రాజధానిగా నిర్ణయించిన అమరావతిపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు మరువలేనివని ఈ సందర్భంగా అయన గుర్తు చేశారు. అమరావతిని రాజధానిగా ఉండకుండా చూడడానికి ఎన్నోకుట్రలు చేశారని, ఈ రాజధానిని కాపాడుకోవడం కోసం అమాయకపు రైతులు 800 రోజులకు పైగా దీక్ష చేస్తూనే ఉన్నారని వారి బాధను గుర్తు చేశారు. ఈ రోజు హై కోర్ట్ ఇచ్చిన తీర్పుతో అమరావతి కోసం పోరాడిన ప్రతి ఒక్క రైతు గెలిచాడని వారి శ్రమను గుర్తించారు.
ఏపీ ప్రభుత్వం అమరావతిని గతంలో ఎడారిగా చూపించే ప్రయత్నాలు చేశారన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం చేసిన ఎన్నో డొంకతిరుగుడు కార్యకలాపాలు రైతులు ధైర్యమైన దీక్ష ముందు నిలవలేదని చంద్రబాబు వారిని పొగిడారు. ఇది నిజంగా అమరావతి రైతుల విజయంగా అభివర్ణించారు. ఇక ఏపీ ప్రభుత్వం తమ ప్రయత్నాలు అన్నీ విరమింపచేసుకుని అమరావతిని రాజధానిగా ఒప్పుకోవాలని చురకలు అంటించారు. ఈ తీర్పు ముఖ్యంగా జగన్ నిర్ణయాలకు ఆలోచన విధానాలకు చెంప పెట్టు అన్నారు.