ప్రపంచంలోనే అతిపెద్ద విమానంపై దాడి..!
మరోవైపు ఉక్రెయిన్ పై దురాక్రమణను నిరసిస్తూ ఆయా దేశాలు రష్యాకు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే కఠినమైన ఆంక్షలను విధించిన పాశ్చాత్య దేశాలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. రష్యా విమానాల కోసం స్పెయిన్, కెనడా, ఐస్ లాండ్, బెల్జియం, ఫిన్లాండ్ తదితర దేశాలు ఎయిర్ స్పేస్ ను మూసేశాయి. ఇలాంటి చర్యలే చేపట్టేందుకు జర్మనీ కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం.
రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వాయుధ దళాలను అప్రమత్తం చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పుతిన్ ఆదేశాలు ఆమోదయోగ్యం కావని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ స్పష్టం చేశారు. పుతిన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని.. ప్రమాదకరమని నాటో కూటమి సెక్రటరీ జనరల్ జెన్స్ సోల్జెన్ బర్గ్ అన్నారు.
ఇక 1998లో వాయి పేయీ హయాంలో జరిపిన అణుపరీక్షలను ఉక్రెయిన్ తీవ్రంగా వ్యతిరేకించింది. అణు పరీక్షలను నిలిపివేసి.. అణు నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేయాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమర్థించింది. భారత విజ్ఞప్తిని పక్కనపెట్టి 2017లో పాకిస్థాన్ కు 330 టి80డి యుద్ధ ట్యాంకులను విక్రయించింది. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి విషయంలోనూ పాక్ కు సపోర్ట్ చేసింది. ఇప్పుడు యుద్ధం వేళ మన దేశ సాయం కోరుతోంది.
ఇక న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగానికి రష్యా ఆదేశిక వ్యవస్థను రూపొందించింది. ఇందుకోసం ముందుగా దేశాధ్యక్షుడు, రక్షణ మంత్రి లేదా చీఫ్ ఆఫ్ ది జనరల్ స్టాఫ్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ చెగెట్ అణు సూట్ కేస్ ద్వారా సాగుతుంది. దీని ద్వారా అణుబాంబులను అన్ లాక్ చేసి.. ప్రయోగానికి అనుమతి ఇచ్చే అధికారం సైనిక అధికారులకు ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఏ దేశంపైనా రష్యా అణుబాంబు దాడికి పాల్పడలేదు.