చైనా బంకర్ ధ్వంసం.. భారత్ భలే దెబ్బకొట్టింది?

praveen
భారత చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గాయి అనుకుంటున్న సమయంలో మరోసారి చైనా వ్యవహరిస్తున్న తీరు అగ్గి రాజేసే విధంగానే ఉంది. ఇప్పటికే భారత్ చైనా సరిహద్దు లో కొన్ని నెలల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఒకానొక దశలో ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదు అనే విధంగానే మారిపోయింది పరిస్థితి. ఇక ఇటీవల కాలంలో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గాయి అనుకుంటున్న సమయంలో ఇటీవల చైనా మరోసారి సరిహద్దుల్లో చొరబాటు ప్రయత్నించడం సంచలనంగా మారిపోయింది.

 దీంతో భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి అని చెప్పాలి. ఇటీవల ఈస్ట్రన్ లడక్ ప్రాంతంలో చైనా సైనికులు భారత సరిహద్దుల్లో కి చొరబడేందుకు ప్రయత్నించారూ. ఈ క్రమంలోనే ఇది గమనించి  అప్రమత్తమైన భారత సైన్యం చైనా సైనికులకు ఎదురు నిలబడి తరిమి తరిమి కొట్టింది. అటు వెంటనే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్,  భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆర్మీ అధికారులు కూడా ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించిన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిషేధిత భూభాగంలో చైనా భారీ బంకర్ నిర్మాణం చేపట్టింది అన్న విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ విభాగం తెలిపింది.

 దీంతో ఇటీవల భారత సైన్యం సత్తా ఏంటో మరోసారి చూపించింది. ఏకంగా నిషేధిత ప్రాంతంలోని చైనా నిర్మించిన బంకర్ పై బాంబుల వర్షం కురిపించింది. ఇక చైనా కు సంబంధించిన బంకర్ ను పూర్తిగా ధ్వంసం చేసింది అని తెలుస్తోంది. అంతేకాకుండా నిషేధిత  భూభాగంలో ఉన్న సైనికులపై ఆయుధ రహిత దాడి చేసి ఇక వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది. ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో సరిహద్దుల్లో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ మరోసారి తెరమీదికి వచ్చింది. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అనే విషయంపై ఇటీవల జరిగిన ఎమర్జెన్సీ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: