ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలంటేనే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఉమ్మడిగా ఉన్న సమయంలో అతి పెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఇక్కడి పార్లమెంటు స్థానాలు కీలకంగా ఉండేవి. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో జాతీయస్థాయి పార్టీలు లేకుండా పోయాయి. ఉన్న పార్టీలు తూతూ మంత్రం గానే డిపాజిట్లు కూడా దక్కించుకునే స్థాయిలో లేకుండా పోయాయని చెప్పవచ్చు. కానీ ప్రాంతీయ పార్టీలైనటువంటి టిడిపి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహూరి పోరు జరిగేది. ఇందులో రాష్ట్ర విభజన తర్వాత 2014లో టిడిపి, జనసేన, వైసిపి వేరువేరుగా పోటీ చేశాయి. ఇందులో టిడిపి ఘన విజయం సాధించింది.
ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలన తర్వాత మరోసారి 2019లో ఎన్నికలు జరిగాయి. ఈ టైంలో ప్రజలంతా వైసీపీకే పట్టం కట్టారు. ఇలా ఐదు సంవత్సరాల పాలన కూడా కొనసాగింది. ఇక 2024 ఎన్నికలు రానే వచ్చాయి. ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపితో కలిపి కూటమిగా ఏర్పడింది. కానీ వైసీపీ సింహం సింగిల్ గా వస్తుంది అంటూ సింగిల్గానే పోటీ చేసింది. దీంతో టిడిపి కూటమి మరియు వైసీపీ పార్టీల మధ్య హోరాహోరీ ఏర్పడింది అని చెప్పవచ్చు. కానీ ఈ పోటీలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అని చెప్పడం చాలా కష్టంగానే మారింది.. ఇదే తరుణంలో ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ అయ్యాయి.
ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కొన్ని సంస్థలు వైసిపికి గెలుస్తుందని చెబుతుంటే మరికొన్ని సంస్థలు టిడిపి కూటమి గెలుస్తుందని చెబుతున్నాయి. కానీ ఎక్కువ సర్వేలు మాత్రం టిడిపి కూటమిదే అధికారం అంటూ చెబుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే టైం నౌ సర్వే సంస్థ వారి యొక్క ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేసింది. టైమ్స్ నౌ ఆంధ్రప్రదేశ్ లోని లోక్సభ ఫలితాలపై ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టిడిపి కూటమి 11 స్థానాలకు పరిమితం అవుతుందని తెలియజేశారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం వెళ్లి విరుస్తోంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగానే ఫలితాలు కూడా ఉంటాయి.. మరి పూర్తిస్థాయి ఫలితాలు రావాలి అంటే జూన్ 4 వరకు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూడాల్సిందే.