ఫోన్ టాపింగ్ కేస్ ను అలా చేయాలని చూస్తున్నారు... బండి సంజయ్..!

Pulgam Srinivas
గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ కేసు కల కాలం రేపుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఫోన్ టాపింగ్ కేసును తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ పార్టీ చూస్తోంది అని బిజెపి పార్టీ గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఇకపోతే తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనూ బిజెపి లో అత్యంత కీలక నేతలలో ఒకరు అయినటువంటి బండి సంజయ్ ఫోన్ టాపింగ్ కేసు గురించి ఓ లేఖ రాశారు.

అందులో తెలంగాణ లోని ఫోన్ టాపింగ్ కేసును సిబిఐ కి అప్పగించాలి అని సీఎం రేవంత్ రెడ్డి కి బిజెపి నేత బండి సంజయ్ లేఖ ను రాశారు. అలాగే కాలేశ్వరం మాదిరే ఫోన్ టాపింగ్ కేసు ను కూడా అటకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఆయన అన్నారు. ఢిల్లీ స్థాయిలో ఒత్తులు రావడంతోనే ఫోన్ టాపింగ్ కేసు విచారణ ఆగిపోయింది. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు కేసీఆర్ , కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి అనర్హులు రాష్ట్రంలోకి సిబిఐ అనుమతి నిషేధిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ను రద్దు చేయాలి అని ఆయన కోరారు.

ఇలా తాజాగా బండి సంజయ్ తెలంగాణ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫోన్ టాపింగ్ కేసు గురించి స్పందించారు. ఇది ఎలా ఉంటే మే 13 వ తేదీన తెలంగాణ రాష్ట్రం లో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో బీజేపీ పార్టీ భారీ మొత్తంలో సీట్లను కైవసం చేసుకొనున్నట్లు చెబుతూ వస్తోంది. మరి ఏ స్థాయిలో బిజెపి ఎంపీ స్థానాలను తెలంగాణలో దక్కించుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే కరీంనగర్ నుండి బండి సంజయ్ కూడా ఎంపీ గా బిజెపి పార్టీ నుండి బరిలోకి దిగాలి. బండి సంజయ్ కి గెలుపు అవకాశాలు కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bs

సంబంధిత వార్తలు: