కొడుకు పెళ్లి.. తండ్రి షాకింగ్ నిర్ణయం.. ఏం చేసాడో తెలుసా?
అందరూ అనుకుంటున్నట్లుగా కార్ తీసుకురావడం కాదు ఏకంగా హెలికాప్టర్ కొడుకు కోసం తీసుకు వచ్చాడు. షాక్ అవుతున్నారు కదా.. కానీ ఇది నిజంగానే జరిగింది. హేళన చేసే మాటలు ఎంతవరకైనా దారితీస్తాయి అనడానికి ఇదొక నిదర్శనం గా మారిపోయింది అని చెప్పాలి. రాజస్థాన్ లోని కారౌరి జిల్లాలోని కామ్రే గ్రామానికి చెందిన రాధేశ్యామ్ సైని ఒకరోజు తన కొడుకుతో కలిసి హెలికాప్టర్ బొమ్మ తో ఆడుకుంటున్నాడు. అటువైపుగా వచ్చిన ఒక వ్యక్తి కొడుకు పెళ్ళికి నిజమైన హెలికాప్టర్ తీసుకొస్తావా అంటూ కాస్త హేళనగా కామెంట్ చేశాడు. ఇక ఇలా కామెంట్ చేసిన వ్యక్తి ఆ మాటలను ఎప్పుడో మర్చిపోయాడూ. కానీ రాధేశ్యామ్ సైని మాత్రం మనసులోని పెట్టుకున్నాడు.
దీంతో ఎప్పటికైనా కొడుకు పెళ్లికి హెలిక్యాప్టర్ తీసుకురావాలి అని ఫిక్స్ అయిపోయాడు. ఇక ఇలా హెలికాప్టర్ లో తన గ్రామంలోని అందర్నీ కూడా ఆశ్చర్యపరిచాలి అనుకున్నాడు. ఇక అతను అనుకున్నట్లుగానే ఏకంగా కొడుకు పెళ్లికి ఆరు లక్షలు వెచ్చించి మరీ హెలికాప్టర్ బుక్ చేశాడు. ఇకపోతే మరోవైపు వధువు తండ్రి దినేష్ మాత్రం ఎంతో పేద కుటుంబానికి చెందినవాడు కావడం గమనార్హం. పెళ్లికూతురు కలలో కూడా ఊహించని విధంగా పెళ్లి సమయంలో హెలికాప్టర్లో వెళ్లడం తో సంతోషం లో మునిగిపోయింది. హెలికాప్టర్ లో వధూవరులు వెళ్లడం చూసి గ్రామస్తులందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇక ఈ ఘటన కాస్త స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.