25 వేల కోళ్లను చంపేయండి.. కలెక్టర్ ఆదేశం.. ఎందుకో తెలుసా?

praveen
ఇప్పటికీ కరోనా వైరస్ తో దేశం మొత్తం అల్లాడిపోతోంది.  మనిషి ప్రాణాలు ఎప్పుడు పోతాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తుంది భారత ప్రజానీకం. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా మహమ్మారి కరోనా మాత్రం పంజా విసురుతు ఉంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే కరోనా వైరస్ తో అందరిలో భయం పట్టుకుంది.  ఇక కొన్ని రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ కేసుల సంఖ్య కూడా పెరిగి పోతూ ఉండటం మరింత ఆందోళనకరంగా మారిపోయింది.

 ఇలా మనిషి ప్రాణాలను గాల్లో కలపడానికి ఏదో ఒక మహమ్మారి ముంచుకు వస్తూనే ఉంది. ఇటీవలే మహారాష్ట్రలోని థానే జిల్లాలో మరోసారి బాంబు కలకలం రేపింది. వెహ్లోలి లో ఉన్న ఒక కోళ్ల ఫారం లో దాదాపు 100 కోట్లు ఒక్కసారిగా మృత్యువాత పడడంతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇక ఈ కోళ్లు బర్డ్ ఫ్లూ సోకింది మరణించాయ్ అని అనుమానంతో కోళ్ల నమూనాలను పూణేలోని ల్యాబ్ కు పంపించారు అధికారులు. ఇక వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు అధికారులు.

 కోళ్ల ఫారం లో ఉన్న కోళ్లు అన్నింటినీ కూడా చంపేయాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. వెహ్లోలికి కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్న సుమారు 25 వేల కోళ్లను చంపేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. బర్డ్ ఫ్లూ కేసులను గుర్తించినట్లు కేంద్ర పశుసంవర్ధక శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇక ఏది ఏమైనా బర్డ్ ఫ్లూ భయం నేపథ్యంలో ఒక్కసారిగా వందకోట్లు చనిపోవడం మిగిలిన కోళ్లను కూడా చంపేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం మాత్రం ప్రస్తుతం అందరిలో భయాందోళనకు కారణం అవుతుంది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: