అమరావతి : టీడీపీతో పొత్తంటే ఇందుకే భయపడుతున్నాయా ?
తెలుగుదేశంపార్టీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా లాభం మాత్రం చంద్రబాబునాయుడుదే. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపణైంది. ముందు పొత్తులు పెట్టుకోవటం తర్వాత సీట్ల సర్దుబాటు చేసుకోవటం మామూలే. చివరకు నామినేషన్లు వేయాల్సొచ్చేటప్పటికి పొత్తుల్లో వదులుకున్న కొన్ని సీట్లలో మళ్ళీ టీడీపీ తరపున నామినేషన్లు వేస్తారు తమ్ముళ్ళు. మున్సిపల్ వార్డు ఎన్నిక దగ్గర నుండి అసెంబ్లీ ఎన్నికవరకు ఇలా చాలాసార్లే జరిగింది. ఇందుకనే జగన్మోహన్ రెడ్డిపై పోరాటానికి అందరు కలిసి రావాలని పిలిపిచ్చినా ఎవరు ముందుకు రావటంలేదు.
అప్పటికే పొత్తులు పెట్టుకున్న కారణంగా ఆ పార్టీ తెగతెంపులు చేసుకోలేక, అలాగని టీడీపీ ఎత్తుకు పై ఎత్తు వేయలేక అవస్తలు పడుతుంది. చివరగా 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీచేసిన బీజేపీకి బాగా అనుభవమే. తర్వాత కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మరింత అనుభవం వచ్చింది. సరే ఇదంతా చరిత్రగా మారిపోయింది. ఎందుకంటే భవిష్యత్తులో టీడీపీతో పొత్తు పెట్టుకోవటానికి ఇప్పటికైతే ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదన్నది వాస్తవం. పొత్తు కాదు కదా చివరకు జగన్మోహన్ రెడ్డిపై పోరాటాలకు కలసిరావాలని చంద్రబాబు పిలుపిచ్చినా ఎవరు ముందుకు రావటంలేదు.
ఈ కారణంగానే జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు పదే పదే పవన్ కల్యాణ్ కు లవ్ ప్రపొజల్సు పంపుతున్నది. ఇప్పటికైతే పవన్ ఏమీ స్పందించకపోయినా ఎన్నికల నాటికి టీడీపీతో పొత్తుకు రెడీ అవుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో జనసేన కొన్నిసీట్లలో గెలవాలంటే బీజేపీతో ఎలాంటి ఉపయోగమూ ఉండదు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే కనీసం కొన్ని సీట్లలో అయినా గెలుపు సాధ్యమేమో. ఈ విషయం పవన్ కు తెలియందేమీ కాదు.
అందుకనే ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తాము పోటీచేయబోయే సీట్ల విషయంలో గట్టిగా ఉండాలని అనుకుంటున్నారట. పొత్తుల్లో సీట్లు ఖరారు కావటం మళ్ళీ కొన్నింటిలో నామినేషన్లు వేయటం, మరికొన్నింటిలో ఫ్రెండ్లీ కంటెస్టని చెప్పటాన్ని పవన్ కంట్రోల్ చేయగలిగేతేనే జనసేనకు ఉపయోగం. లేకపోతే పూర్తిగా దెబ్బతినటం, ఇదే సమయంలో తెలుగుదేశంపార్టీ లాభపడటం తప్పదు. అదికూడా సక్రమంగా ఓట్ల బదిలి జరిగితేనే లేండి. మరి రేపైనా పొత్తుల్లో టీడీపీ పద్దతిగా ఉంటుందా ?