దటీజ్‌ కిమ్‌.. పువ్వులు పూయలేదని తోటమాలికి జైలుశిక్ష!

Chakravarthi Kalyan
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌.. గురించి తెలుసుకదా.. ఆయనో నియంత.. నియంతల గురించి మన చరిత్రలో చదువు కోవడమే తప్ప.. మన కాలంలో చూసింది, విన్నది చాలా తక్కువ.. ఆ లోటు తీర్చేందుకే ఈ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఉన్నట్టు ఉన్నాడు. అవును మరి.. తండ్రి జన్మదిన వేడుకలకు పువ్వులు సరిగ్గా పూయించలేదని కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఇద్దరు తోటమాలులకు జైలు శిక్ష విధించాడు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని మన పెద్దలు చెబుతారు కదా.. బహుశా అలాంటి ఫిలాసఫీని కిమ్‌ జాంగ్‌ ఉన్‌ పాటిస్తున్నట్టు కనిపిస్తోంది.


కిమ్‌ జాంగ్‌ ఉన్‌.. ఎలాంటి చిన్న తప్పుకైనా పెద్ద శిక్షలే వేస్తాడు మరి. తాజాగా మొక్కలకు పువ్వులు పూయలేదని తోటమాలికి జైలు శిక్ష వేశాడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌.. ఇప్పుడు ఈ శిక్ష వార్తలో మళ్లీ కిమ్ జోంగ్ ఉన్ వార్తల్లోకి వచ్చాడు. అసలేం జరిగిందంటే.. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ జన్మదినం ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అలంకరణ కోసం ఉపయోగించే ‘కిమ్‌ జోంగిలియా’ బిగోనియా పువ్వులు మాత్రం ఆశించినతంగా దొరకలేదట. ఈ పువ్వుల పెంపకం కోసం కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ప్రత్యేకంగా ఇద్దరు తోటమాలిలను కేటాయించాడట.


ప్రత్యేకంగా ఇద్దరు తోటమాలిలను పెట్టినా.. ఆశించిన స్థాయిలో పువ్వులు పూయలేదట. దీంతో తండ్రి జన్మదిన వేడుకలలో  ఆ పూవులు లేని లోటును కిమ్‌ జాంగ్‌ ఉన్‌ బాగా ఫీలయ్యారు. అంతే.. ఆ తోటమాలీలను కిమ్‌ జాంగ్‌ ఉన్‌ వెంటనే అరెస్ట్ చేయించాడు. వీరిద్దరికి ఆరునెలలు శిక్ష విధించాడు.. క్షణం ఆలస్యం చేయకుండా వారిని లేబర్ క్యాంప్ కు అంటే జైలుకి తరలించాడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌.. ఫిబ్రవరి 16 న కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తండ్రి కిమ్ జోంగ్-ఇల్ జయంతి.


ఈ రోజు రహదారి పొడువునా.. తండ్రి సమాధి ప్రాంతం వరకూ ఈ ఎర్రటి కిమ్‌జోంగిలియా పువ్వులు పూయిస్తారు. అందుకోసం చాలా ముందుగానే ఏర్పాట్లు చేస్తారు.. మొక్కలు నాటిస్తారు. అయితే ఈ పవ్వులు చాలా ప్రత్యేకమైనవి.. ఇవి సమశీతోష్ణస్థితి వాతావరణంలో మాత్రమే పెరుగుతాయట. ఏమాత్రం వాతావరణంలో తేడా వచ్చినా ఇవి పూయవు.. ఈ ఏడాది అదే జరిగింది. అదే ఆ తోటమాలిల కొంప ముంచింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

KIM

సంబంధిత వార్తలు: