ఆర్ఆర్ఆర్ : ఆహా రాజమౌళి ఓహో రాజమౌళి పాపం రాజమౌళి
వినోదపు పన్ను ఎగ్గొట్టడంలో గ్రేట్
రాజమౌళి ద గ్రేట్
అమరావతికి సంబంధించి 3డీ బొమ్మలు
తయారు చేసి ఇవ్వడంలో!
కానీ ఇప్పుడు అవన్నీ ఏమయిపోయాయి?
పాపం నిన్నటి వేళ ఆర్ నారాయణ మూర్తి ఫైర్ అవుతుంటే
నవ్వుతూ కోపాన్ని ఎందుకు రా అణుచుకున్నాడు....
అదే చంద్రబాబు అధికారంలో ఉంటే ఇంత జరిగేదా
అసలు ఆయన్ను సచివాలయం దాకా రానిస్తాడా
సీఎం క్యాంపు ఆఫీసు చుట్టూ తిరగనిస్తాడా
ఓర్ని అందరి ఆశలనూ అడియాశలు చేశావు కదయ్యా జగన్...
నిన్నటి వేళ సీఎం జగన్ తో చర్చలు జరిపివచ్చాక మీడియా మీట్ లో చాలా విషయాలు చిరంజీవి చెప్పారు.ఇదే సమయంలో రాజమౌళి కూడా కొన్ని మాటలు వెల్లడించారు.ఇండస్ట్రీ పెద్ద చిరంజీవే అని తేల్చేసి,ఎవరు ఔనన్నా,కాదన్నా ఇదే నిజం అని అన్నారు.తరువాత మాట్లాడిన ఆర్ నారాయణ మూర్తి భారీ చిత్రాల కారణంగా చిన్ని సినిమాలకు థియేటర్లే లేకుండా పోతున్నాయని ఆవేదన చెందారు.ఈ మాట చెబుతున్నప్పుడు రాజమౌళి ముఖంలో కవళికలు మారిపోయాయి.ఇంతకూ రాజమౌళి అక్కడ నెగ్గాడా?
ముందుగా రాజమౌళి తన ఆఫీసుకు రప్పించుకున్న జగన్ గ్రేట్ అని అనాలి.ఎందుకంటే వీళ్లంతా ఆ రోజు చంద్రబాబు హయాంలో అమరావతి భ్రమల్లో ఉన్నవారు.చంద్రబాబు కోసం 3డీ బొమ్మలు తయారు చేసి ఇచ్చినవారు.అంతేకాదు ఇదే మాట జగన్ ఎన్నో సార్లు చెప్పి రాజధాని అంటే 3డీ యానిమేషన్ వర్క్ కాదని అన్నారు కూడా! సరే ఇప్పుడు ఎలానూ వచ్చారు కనుక కాస్త తగ్గి జగన్ కానీ ఆయన మనుషులు మాట్లాడి ఉండవచ్చు కానీ ఆ రోజు వీళ్లంతా ఎవరు? టీడీపీ మనుషులు కాదా? మేం టీడీపీ కోసమే పుట్టాం టీడీపీ కోసం చస్తాం అన్నంత స్థాయిలో టీవీ 9 బ్యాచ్ తో కలిసి రాజకీయాలు చేసిన వారు కాదా!
ఏంటో పాపం ఈ బ్యాచ్ అంతా ఎటుపోయిందో ? ఏమయిపోయిందో? బోయపాటి శ్రీను లాంటి దర్శకులు, రాజమౌళి లాంటి దర్శక ధీరులు ఆ రోజు అమరావతి కోసం చాలా కష్టపడ్డారే! ఆ పాటి కష్టం జగన్ కోసం పడమంటే పడతారా చెప్పండి.అందుకోసం రాజమౌళి అత్యంత తెలివితేటలతో ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు వెర్షన్ బిజినెస్ పూర్తిగా వదులుకుని, ఉత్తరాది కేంద్రగా నిలదొక్కుకోవాలని తెగ తాపత్రయపడ్డాడు. కానీ కరోనా మాత్రం అందుకు సహకరించక ఆయన కలల్ని కల్లలు చేసింది.దీంతో ఉత్తరాది వైపు థియేటర్లు ఒక్కసారి గా మూతపడ్డాయి.ఒకవేళ తెరుచుకున్నా కూడా యాభై శాతం ఆక్యుపెన్సీతో నడవాల్సి ఉంటుంది.కనుక ఆయన మళ్లీ పునరాలోచనలో పడ్డాడు. జగన్ సర్కారుతో బేరం పెట్టుకునేందుకు వెళ్లాడు.