కూతురి కోసం చిరుతతో ఫైటింగ్.. చివరికి?

praveen
నవమాసాలు మోసి మూసి జన్మనిచ్చిన తల్లి ఇక తనకు పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఏ సమస్య రాకుండా చూసుకుంటుంది. సమాజం దృష్టిలో కేవలం అబలగా మాత్రమే ఉన్న మాతృమూర్తి ఇక తన పిల్లలకు ఏదైనా కష్టం వచ్చింది అంటే చాలు అపర కాళిలా మారిపోతు ఉంటుంది. ఇలా కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు సైతం పిల్లలకు అపాయం కలిగింది అంటే చాలు ప్రాణాలకు తెగించి మరి అపాయాన్ని దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇక్కడ అమ్మ ప్రేమ ఎంత గొప్పది అన్న దానికి మరో ఘటన నిదర్శనంగా మారిపోయింది.

సాధారణంగా ఎక్కడైనా చిరుతపులి కనిపించింది అంటే చాలు ప్రాణభయంతో పరుగులు పెడుతూ ఉంటారు అందరూ. ఎందుకంటే ఒక్కసారి చిరుత దాడి చేసింది అంటే ప్రాణాలు తీసేంత వరకు కూడా వదలదు. దీంతో పక్కన సొంత వాళ్ళు ఉన్నా వారిని అక్కడే వదిలేసి పారిపోవడం చేస్తూ ఉంటారూ చాలా మంది. కానీ ఇక్కడ ఓ మహిళ మాత్రం తన కూతురి కోసం చిరుత తో ఫైటింగ్ చేసింది.. తన కూతురికి అపాయం వచ్చింది అని భావించి ఒక్కసారిగా అపరకాళిగా మారిపోయింది ఆ తల్లి.

 తన కూతురి ప్రాణాలు కాపాడాలని ఒక్క ఆలోచన తప్ప తన ముందు ఉంది చిరుత, సింహమా లేక పోతే ఇంకేదైనా అనే ఆలోచన మాత్రం ఆ మహిళ మనసు లోకి రాలేదు. ప్రాణాలకు తెగించి చిరు త తో పోరాడి కూతురు ని కాపాడుకుంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని బహ్రెయిన్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది నాన్ పారా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో చిరుత ప్రవేశించింది. బయట ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిపై దాడి చేసి ఎత్తుకెళ్లింది చిరుత.

 అయితే చిన్నారి కేకలు విన్న తల్లి అపర కాళిలా మారిపోయింది. చేతిలో కత్తికర్ర పట్టుకుని అక్కడికి వచ్చింది. కర్రతో చిరుత పై తిరగబడింది. ఇక మహిళా దెబ్బలకు తాళలేక పోయిన చిరుత అక్కడి నుంచి పారిపోయింది. చిరుత దాడి లో బాలిక తలకు గాయాలయ్యాయి.. వెంటనే తన కూతుర్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించింది. ఈ క్రమంలోనే కూతురి కోసం మహిళా ఏకంగా చిరుత పులి తో పోరాడిన తీరు తల్లి ప్రేమ ఎంతో గొప్పది అన్న దానికి నిదర్శనం గా మారిపోయింది. అంతేకాకుండా ఆ మాతృమూర్తి ధైర్యానికి మహిళా లోకం మొత్తంఫిదా అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: