ఖేల్ ఖతం : జగనన్న పోలీసు అస్సలు మాట వినడే !
పీఆర్సీ పోరు ఉద్ధృతం అయింది.ఎక్కడిక్కడ ఉద్యోగులను నిలువరిస్తున్నారు.తనిఖీల పేరిట వేదిస్తున్నారు.ఇవాళ ఛలో విజయవాడ కార్యక్రమానికి శ్రీకారం దిద్దిన నేపథ్యంలో ఉద్యోగులంతా తీవ్ర స్థాయిలో తమ గొంతుక వినిపించేందుకు సిద్ధం అవుతున్నారు.ఓ వైపు ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ఇప్పటికే హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయ విచారణ సాగుతోంది.మరోవైపు ఉద్యోగులు ప్రత్యక్ష కార్యాచరణలో భాగంగా ఇవాళ సర్కారు వద్దంటున్నా వినిపించుకోకుండా, ఇంతటి ప్యాండమిక్ సిట్యువేషన్ లో కూడా తీవ్ర నిరసనలకు సమాయత్తం అవుతున్నారు.దీంతో ప్రతి ఒక్క ఉద్యోగి ఏదో ఒక విధంగా రోడ్డెక్కి నిరసన తెలపాలని, అడ్డదారుల్లో విజయవాడకు చేరుకుని ఉద్యమానికి సంఘీభావం తెలపాలని భావిస్తున్నారు.
ముఖ్యంగా అద్దె భత్యం చెల్లింపుల్లో చాలా వ్యత్యాలు ఉన్నాయని, గతంలో చంద్రబాబు హయాంలో పోరాడి సాధించుకున్న ఇరవై శాతం అద్దె భత్యాన్ని కాస్త ఎనిమిది శాతానికి తగ్గించారని,ఇది అన్యాయమని ఉద్యోగులు అంటున్నారు. ఏ విధంగా చూసుకున్నా కొత్త పే స్లిప్ ప్రకారం తమకు డీఏలతో కలుపుకుని జీతం పెరిగిందని చెబుతున్నారని కానీ వాస్తవానికి తాము కోల్పోయింది అనూహ్య స్థాయిలో ఉంది అని అంటున్నారు. ఒక్క హెచ్ఆర్ఏ తగ్గింపే ఐదు వేలకు పైగా ఉందని ఉద్యోగులంతా వాపోతున్నారు.
ఈ దశలో జగన్ మోహన్ రెడ్డి ఇవాళ జరుగుతున్న ఛలో విజయవాడకు అస్సలు అనుమతులే లేవని తాము ఒప్పుకోమని చెబుతున్నారు.ఎందుకంటే చర్చలకు పదే పదే పిలుస్తున్నా పట్టించుకోకుండా ఉద్యోగులు తమ దారి తమదే అన్న విధంగా వ్యవహరించకూడదని ప్రభుత్వం చెబుతోంది.అదేవిధంగా ఇవాళ ఎవ్వరికీ సెలవులు మంజూరు చేయకూడదని డిపార్ట్మెంట్ హెడ్స్ కు ఆదేశాలు వెళ్లాయి.రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు.కొందరు ఇళ్లకు వెళ్లి మరీ! నోటీసులు ఇవ్వడంతో పెద్ద తగాదానే ఇరు వర్గాల మధ్య వస్తోంది. ఇలాంటి సందర్భంలో కూడా ఉద్యోగులు సహనంతోనే ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. తమ కెరియర్లో మొదటి సారి ఓ పోలీసు తమ పాఠశాలకు వచ్చి నోటీసు ఇవ్వడం అని ఓ ఉపాధ్యాయుడు వాపోతున్నారు.అయినా కూడా నిర్బంధాల మధ్యే ఉద్యోగులు ఇవాళ నిరసనను కొనసాగిస్తున్నారు.