ఎన్నికల వేళ.. పంజాబ్ లో షాకింగ్ ఘటన?

praveen
సాధారణం  గా పంచాయితీ, పరిషత్ ఎన్నికలు వచ్చాయి అంటే చాలు డబ్బులు మద్యం ఏరులై పారుతూ ఉంటుంది. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అభ్యర్థులు. అలాంటిది అసెంబ్లీ ఎన్నికలు వస్తే హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. అధికారాన్ని చేజిక్కించుకోవడ మే లక్ష్యంగా వ్యూహాత్మకం గా పావులు కదుపుతూ ఉంటాయి అన్ని పార్టీలు. ఇక డబ్బులు పంచటం గురించి అయితే ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.



 ఇకపోతే ప్రస్తుతం పంజాబ్లో ఎన్నికల వేడి రాజుకుంది. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు గా ఉన్న కాంగ్రెస్ బీజేపీలు సర్వ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాయి. ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యం గా ముందుకు సాగుతున్నాయి. అయితే ఎన్నికల సమయం లో డబ్బు మద్యం లాంటివి పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే అక్రమంగా  తరలిస్తున్న మద్యం డబ్బు లాంటివి బయటపడడం చూస్తూ ఉంటాం.



 ఇక పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలాంటి ఒక సంఘటన వెలుగు లోకి వచ్చింది. ఊహించని రీతిలో అక్రమ మద్యం డ్రగ్స్ నగదు అధికారులు గుర్తించారు. ఇలా పోలీసులు సీజ్ చేసిన దాంట్లో 303 కోట్ల రూపాయల నగదు వస్తువుల ను ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  273 కోట్ల డ్రగ్స్,12 కోట్ల విలువైన 26.64 లీటర్ల మద్యం.. ఎలాంటి ఆధారాలు లేని 18 కోట్ల నగదు జమ చేసినట్లు చెప్పు కొచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ నగదు మద్యం ఎవరు అక్రమంగా తరలిస్తున్నారు అనే దానిపై విచారణ ప్రారంభించారు. ఇక పోతే ఫిబ్రవరి 20వ తేదీన పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: