డ్రగ్స్ కేసు: కీలక సమాచారం బయటపెట్టిన టోనీ...

VAMSI
ప్రపంచ భవిష్యత్తుకు యువకులు ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రానున్న కాలంలో యువతే అత్యంత కీలకముగా మారనున్నారు. అందుకే మన యువతను కాపాడుకోవడం అందరి బాధ్యత అని గుర్తుంచుకోవాలి. కానీ అలాంటి యువత నేడు క్షణిక సుఖాలకు అలవాటు పడిపోయి వివిధ చెడు అలవాట్లకు బానిసలు అయిపోతున్నారు. అందులో ముఖ్యంగా డ్రగ్స్ కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రాజుకీ పెరిగిపోతోంది. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో మనకు తెలిసిందే.

ముఖ్యంగా తెలంగాణ లోని హైదరాబాద్ నగరంలో ప్రభజనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో A1 నిందితుడిగా ఉన్న టోనీ ఇంత కాలం పోలీసులకు దొరక్కుండా నానా తిప్పలు పెట్టించగా, చివరకు  ముంబైలో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల కంటపడి వాళ్ళ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. గత తొమ్మిదేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి డ్రగ్స్ దందాను ముందుండి నడిపిస్తున్నాడు ఈ నిందితుడు. ఈ ఇంటర్నేషనల్ స్మగ్లర్ డేవిడ్ అలియాస్ టోనీ ని గత రెండు రోజులుగా విచారిస్తున్నారు పోలీసులు. కాగా నేడు మూడవ విచారణ నిమిత్తం మళ్ళీ రంగం లోకి దిగారు పోలీసులు. మూడవ రోజు విచారణలో కొన్ని కీలక అంశాలు టోని నుండి రాబట్టే విధంగా సర్వం సిద్దం చేశారట అధికారులు.

ఇప్పటికే జరిగిన రెండు రోజుల విచారణలో పలు విషయాలను, వివరాలను రాబట్టినట్లు తెలుస్తోంది, దాని ఆధారంగా చేసుకొని ఇపుడు థర్డ్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్లాన్ చేశారు. ఇక టోనీపై విచారణ వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి రోజు 5 గంటలు, రెండవ రోజు 4 గంటలు టోనీని పోలీసు అధికారులు ఇన్వెస్టిగేట్ చేశారు. కాగా నేడు పలు ఆధారాలు బయటకు రాబట్టే విధంగా విచారణ ఉండనుంది తెలుస్తోంది. జరిగిన విచారణలో  టోనీ ఆర్ధిక సమస్యల కారణంగానే డ్రగ్స్ దందాలోకి  వచ్చినట్లు టోనీ చెప్పాడని తెలుస్తోంది.  ఈ క్రమంలోనే అతని బ్యాగ్రౌండ్ కు సంబందించిన పూర్తి వివరాలను రాబట్టే పనిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: