నిర్మలమ్మ: మిడిల్ "క్లాస్" బడ్జెట్ ఉంటుందా..!

MOHAN BABU
ఇంకో రెండు రోజుల్లో బడ్జెట్.  కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటున్నామనే టైంలో థర్డ్ వేవ్ వచ్చి పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఎలాంటి బడ్జెట్ తీసుకొస్తారని ఆసక్తి పెరిగింది. కరోనా ముందు నుంచే కష్టాల్లో ఉన్న ఎకానమీని గట్టెక్కించడానికి ఈసారి ఏ సెక్టార్లకు ప్రాధాన్యం ఇస్తారో ఫిబ్రవరి 1న తెలిసిపోతుంది. ఇప్పటికే చాలా సెక్టార్లు తమ కోరికల చిట్టాను ప్రభుత్వానికి అందించాయి.ఇక బంతి సీతారామన్ కోర్టులో ఉంది. అదేంటో చూద్దాం.  కరోనా టైంలో దేశానికి సపోర్ట్ అందించిన సెక్టార్లలో ఫార్మా ముందుంటుంది.మన ఫార్మా ఇండస్ట్రీ మెరుగ్గా పనిచేయ డంతో వ్యాక్సిన్ కోసం,ఇతర కరోనా మెడిసిన్ ల కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గింది. కంపెనీలు తమ రెవెన్యూ లో ఏడాదికి కనీసం పది శాతమైనా ఆర్ అండ్ డి పై ఖర్చు చేస్తే టాక్స్ రాయితీలను ఇవ్వాలని కోరుతున్నాయి.


 తమకు ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వండని ప్రభుత్వాన్ని కోరుతోంది రియల్ ఎస్టేట్ సెక్టార్. హోమ్ లోన్ లపై ప్రస్తుతం రెండు లక్షల వరకు ఇస్తున్న టాక్స్ రాయితీలను, 5 లక్షలకు పెంచాలని ఈ ఇండస్ట్రీ అడుగుతోంది. మరోవైపు ఇన్ పుట్ కాస్ట్ పెరుగుతుండడంతో, ప్రభుత్వం టాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలని రియల్ సెక్టార్ అడుగుతోంది. జీఎస్టీ ని తగ్గించాలని, ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ ను పొందేందుకు వీలు కల్పించాలని కోరుతుంది.
 హెల్త్ కేర్ సెక్టార్ కోసం చేస్తున్న కేటాయింపులో గత నాలుగేళ్లలో 8.9 శాతం పెరిగాయి.అయినప్పటికీ బడ్జెట్లో ఈ సెక్టార్ కోసం చేసే కేటాయింపులు కేవలం 2.2% గానే ఉన్నాయి అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. చాప్టర్ 6ఏ కింద టాక్స్ డిడక్షన్ లతోపాటు, ఇన్ కమ్ గా వచ్చే ఫారిన్ కరెన్సీ ని టాక్స్ ల నుంచి మినహాయించాలని అన్నారు.దీంతో దేశంలో మెడికల్ టూరిజం పెరుగుతుందని చెప్పారు.

 ఎలక్ట్రిక్ వెహికల్స్ సెక్టార్ కు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ ఇండస్ట్రీ కోరుతోంది.ఈ సెక్టార్ల లోకి ఇన్వెస్ట్మెంట్ లను ఆకర్షించేందుకు పాలసీలు మెరుగుపరచాలని ఆటో ఇండస్ట్రీ అడుగుతోంది. జీఎస్టీ ని తగ్గించాలని ఇంపోర్ట్స్ పై డ్యూటీని తగ్గించాలని కోరుతుంది.


 రానున్న బడ్జెట్ లో హెల్త్,ఎడ్యుకేషన్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని మిడిల్ క్లాస్ కోరుతోంది.టాక్స్ బెనిఫిట్స్ కూడా కావాలని మిడిల్ క్లాస్ కోరుతోంది.బేసిక్స్ టాక్స్ మినహాయింపులు పెంచాలని 80సి కింద టాక్స్ డీడక్షన్ల ను పెంచాలని కోరుతోంది. మరోవైపు జాబ్స్ పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: