వామ్మో : కొత్త శత్రువుల తయారీలో జగన్? దేవుడా!
ముఖ్యంగా జగన్ కు ఇవాళ ఉద్యోగుల నుంచి సెగ తగులుతుంది.వాళ్ల నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.పీఆర్సీ కి సంబంధించి వాళ్లు అడుగుతున్నది వీళ్లు చెబుతున్నది ఈ రెంటికీ మధ్య పొంతన అన్నది లేకుండా ఉంది.ఈ తరుణంలో కొత్త వివాదాలేవో పైకి వస్తున్నాయి.ఇదే అదునుగా కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయ ప్రయోజనాల ఆధారంగా మాట్లాడుతున్నారు అన్న వాదన కూడా ఉంది.
వీళ్లంతా ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా పైకి గళం విప్పుతూ తమ తమ ప్రయోజనాల సిద్ధికి వైసీపీతో పనిచేయడం ఇష్టంగానే భావిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీతో గతి చెడితే టీడీపీతో పనిచేసేందుకు కూడా వీరికి ఇష్టమే! దీంతో జగన్ తనకు తెలియకుండానే కొందరు సొంత మనుషులను కూడా శత్రువులుగానే చూడాల్సి వస్తోంది. కొందరు అలా తయారవుతున్నారు కూడా! దీంతో ఎవరు తనవారో! ఎవరు పరాయి వారో తేల్చుకోవడం ఇవాళ జగన్ కు కష్టంగానే ఉంది.
మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కూడా ఎవరెవరో మాట్లాడుతున్నారు. వీటి కారణంగా వైసీపీ కూడా మాట్లాడాల్సి వస్తోంది.వస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత అయితే వైసీపీదే కానీ కొన్ని సార్లు స్థానిక రాజకీయాల కారణంగా అధికార పార్టీ కూడా పెద్దగా నోరు మెదప లేకపోతోంది. కొన్నింట మాత్రం వైసీపీ నాయకులు గళమెత్తి సీఎం నిర్ణయాలను అదే పనిగా ఇదే అదునుగా విమర్శిస్తున్నారు.ఇందుకు రెండు కారణాలు పైకి తేలి ఉన్నాయి. ఒకటి తమకు పదవులు ఉన్నా అవన్నీ అలంకార ప్రాయమేనని అంటున్న వర్గం ఓ వైపు ఉండగా, అధికారం ఉన్నా సంపాదన లేకపోవడం, సంపదలో పెరుగుదల లేదా వృద్ధి లేకపోవడం అన్నవి మరో కారణంగా ఉంది. ఇవన్నీ కూడా వైసీపీకి ప్రాణ సంకటంగానే ఉన్నాయి.కనుక శత్రువుల నిలువరింతలో రేపటి వేళ బొత్స లాంటి సీనియర్ నాయకుల తిరుగుబాటును నివారించడంలో కూడా జగన్ సఫలీకృతం అయితే మేలు.