చంద్రుడిపై టయోటా కార్.. భలే ప్లాన్ వేసారూ?

praveen
చంద్రుడిపై మనిషి మనుగడ సాధ్యం అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ప్రస్తుతం ఎన్నో దేశాలలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా చంద్రుడిపైకి ఎన్నోసార్లు రాకెట్లను పంపించినప్పటికీ ఇప్పటివరకు కచ్చితత్వంతో మనిషి మనుగడకు కావలసిన అన్ని పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది మాత్రం తెలుసుకోలేకపోయారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తు వినూత్న  ప్రయత్నాలు చేయడానికి మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రుడిపై అన్వేషణ కోసం ఒక సరికొత్త వాహనాన్ని రూపొందించేందుకు ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా సిద్ధమైంది అని తెలుస్తోంది.

 జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థతో కలిసి ఈ సరికొత్త ఆవిష్కరణను తయారు చేస్తుంది  టయోటా కంపెనీ. 2040 నాటికి చంద్రుడిపై ఆ తర్వాత కాలంలో అంగారకుడి పైన కూడా ప్రజలు నివసించడానికి అన్ని పరిస్థితులను అన్వేషించడమే దీని ముఖ్య ఉద్దేశం అన్నది అర్థం అవుతుంది. ఇక ఈ ప్రాజెక్టుకు లూనార్ క్రూజర్ అనే పేరు పెట్టారు.  టయోటా చంద్రుడిపైకి పంపాలి అనుకుంటున్నా కార్లలో ప్రజలను సురక్షితంగా తినడం పని చేయడం కూడా చేయగలరట. ఇక రోదసిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సూత్రమే వర్తిస్తుంది అన్నది తెలుస్తుంది. అయితే తనిఖీలు నిర్వహణ  వంటివి చేపట్టేందుకు లూనార్ క్రూజర్ వాహనానికి ఒక రోబోట్ ని కూడా అమరుస్తున్నారు అన్నది తెలుస్తోంది.

 అయితే రోదసి లోకి వెళ్లడం అనేది ఇప్పటి వరకు ఎంతో సవాల్తో కూడుకున్న పనే అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు దాన్ని అధిగమించడం సంతోషంగా ఉంది అంటూ జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత అక్కడ పని చేయడం వ్యోమగాముల కు అందరికీ కూడా ఎంతో ప్రమాదకరం గానే ఉంటుంది. అంతేకాకుండా ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక ఇబ్బందులు లూనార్ క్రూజర్ తో తీరుతాయి అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక చంద్రుడిపై కాలు పెట్టి సరికొత్త అన్వేషణ సాగించాలని తయారవుతున్నా లూనార్ క్లోజర్ వాహనం ఇక ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: