కొత్త వైరస్: 'ముగ్గురిలో ఒకరు చనిపోతారట'... జాగ్రత్త సుమీ? ?
ఈ పరిశోధనకు సంబంధించినటువంటి వివరాలను bioRxiv అనే వెబ్ సైట్లో పొందుపరిచి ఉన్నారు. చైనా పరిశోధకుల చెబుతున్న వివరాలు ప్రకారం నియోకోవ్ అనే ఈ కొత్త రూపాంతరం... MERS-high Cov హై పొటెన్షియల్ కాంబినేషన్ ను కలిగి ఉండటం వలన ఇది చాలా ప్రమాద కారి అని తెలుస్తోంది. ఒకవేళ దీని ఉదృతి కనుక ఎక్కువైతే దీని ప్రభావం మనుషులపై ఎంత భయంకరంగా ఉండబోతోంది అంటే... డెత్ రేషియో అస్సలు ఊహించలేము. ఈ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉందని వారు గురువారం వెల్లడించారు.
నియో కోవ్ కరోనా వైరస్ పై చైనీస్ పరిశోధకులు పొందినటువంటి డేటా గురించి వెక్టర్ రీసెర్చ్ సెంటర్ కు ముందుగానే తెలుసు... అయితే మనుషులలో వేగంగా వ్యాప్తి చెందగల సామర్ధ్యం ఉన్న ఈ కొత్త కోవిడ్ వైరస్ యొక్క ఆవిర్భావం ప్రస్తుతానికి సమస్య కాదని వివరించింది స్పుత్నిక్ వార్తా సంస్థ. అయితే ప్రస్తుతానికి వ్యాప్తి ఇంకా మొదలు కాలేదని తెలుస్తోంది. దేవుడి దయ వల్ల అలా కాకూడదని ప్రార్ధిద్దాం. వేరియంట్ ఏదైనా వైరస్ ఎంత ప్రమాదకరం అయినప్పటికీ మనము కేవలం మన మాత్రులం, వైరస్ సోకాక పరుగులు తీయడం కన్నా, ఇప్పుడు అది రాకుండా జాగ్రత్త పాడడం ఒక్కటే దారి.