అయ్యో!: కోలారు వీధులలో నమాజు తప్పట! కర్ణాటక తీరం
బిడ్డలను ఏ విధంగా అయినా వివాదాల్లో లాగవద్దు. హిందూ ముస్లిం భాయి భాయి అని చెప్పుకునేంతగా మన నినాదాలు ఉన్నప్పుడు వాటిని అమలు చేసే శక్తి విద్యా విధానంలో ఎందుకనిలేదు అని ప్రశ్నిస్తున్నాయి పౌర సంఘాలు. పిల్లలు నమాజు చేసుకోవడం అన్నదే ఎందుకని ఆక్షేపణీయం అయిందో తమకు తెలియడం లేదని ముస్లిం మత పెద్దలు వాపోతున్నారు. బంగారు గనులకు నిలయం అయిన నేలపై రగులుతున్న పరిణామంపై అంతా విస్తుబోతున్నారు. స్కూల్లో ప్రార్థన అందరిదీ! అదే విధంగా ఆ పిల్లల నమాజు కూడా ఏ వర్గంకు మాత్రమే ఎలా అవుతుంది? అని ప్రశ్నిస్తున్నాయి పౌర హక్కుల సంఘాలు. నమాజు చేసుకోవడం అన్నది ఆక్షేపణీయం అయితే బడిలో హిందూ సంప్రదాయం అనుసారం జరిగే ప్రార్థనలు కూడా తప్పే అవుతాయి అంటూ తమ వాదన వినిపిస్తున్నారు.ఏదేమయినప్పటికీ ఈ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు.
నమాజు చేయడం తప్పు ఎలా అవుతుంది. కోలారు తీరాలు అంటేనే బంగారు కలలకు ప్రతీక. అడుగడుగునా బంగారు నిక్షేపాలు ఉన్న నేలపై నమాజు చేయవద్దని చెప్పడం ఎంత తప్పు! విద్యార్థుల కోరిక మేరకు నమాజు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడమే నేరం అయిందన్న విధంగా ఇప్పుడొక వివాదం అక్కడ రాజుకుంటోంది.అంటే పిల్లలు పాఠశాల ప్రాంగణంలో నమాజు చేయడం అన్నది విరుద్ధం అని నియమ నిబంధనలకు అవి అంగీకారంలో లేని పనులు అని చెప్పడం తో పాపం ఆ చిన్నారులు బెంబేలెత్తిపోతున్నారు.
కర్ణాటక రాష్ట్రం, ముల్చగల్ పట్టణం, బలె చెంగప్ప ప్రభుత్వ పాఠశాలలో రాజుకున్న వివాదం ఇది. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు తీసుకున్న క్రియాశీలక నిర్ణయం ఇప్పుడొక వివాదం అవుతోంది. ఇక్కడి పిల్లలు నమాజు చేసుకునేందుకు అవకాశం ఇస్తూ ఓ గదిలో వారికి అనుమతి ఇవ్వడంతో హిందూ సంఘాలు మండి పడుతున్నాయి. బడిలో ఇలాంటివి ఎందుకు చేయనిస్తారని అంటూ వాళ్లంతా ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు పట్టుబడుతున్నాయి.