మెగా జగన్ : మైండ్ గేమ్ వెనుక ఉన్నదెవరు?
ఇంకా చెప్పాలంటే...
రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ ను దాటించి పనిచేయడం కష్టం అని చాలా మంది అంటుంటారు.ఎందుకంటే ఆయన గ్రౌండ్ లెవల్ రియాల్టీలను బాగా అంచనా వేస్తారని ఓ టాక్. ఆ రోజు జగన్ తో నవరత్నాలు పేరిట ప్రకటన చేయించి ఓట్లు దండుకోవడానికి కారణం పీకేనే! ఇప్పడు కూడా సీన్లోకి ప్రశాంత్ కిశోర్ వస్తే జాతకాలు ఎలా మారతాయో అన్నది ఆసక్తిదాయకం.దీంతో టీడీపీ కూడా పునరాలోచనలో పడింది. వచ్చే ఎన్నికల్లో జగన్ కన్నా పీకేనే డేంజర్ అని భావించి ముందుగా ఆయనపై దృష్టి సారించింది. ఇవన్నీ ఎలా ఉన్నా పీకే వస్తే చాలా మంది వైసీపీ నేతల జాతకాలు కూడా మారిపోవడం ఖాయం.
గుడ్డిగా నమ్మితే కష్టమే...
మొత్తం 175 నియోజకవర్గాల్లో పీకే టీం తిరుగాడి కొత్త ముఖాలను కొన్ని తెరపైకి తెచ్చే ఛాన్స్ ఉంది.ఆ విధంగా పీకే తోనే యుద్ధం చేయించాలని జగన్ భావిస్తున్నారు. కానీ పీకే టీం పై కొన్ని ఆరోపణలు ఉన్నాయి.స్థానిక నేతల దగ్గర డబ్బులు తీసుకుని అధిష్టానం దగ్గర రిపోర్టులు మార్చేందుకూ వెనుకాడరని తెలుస్తోంది.అదే కనుక జరిగితే జగన్ కానీ ఇంకొంకరు కానీ పీకేను నమ్ముకుని సాధించేది ఏమీ ఉండదు.
చిరు భేటీపై లీక్స్ భావ్యమా?
ఇక మొన్నటి వేళ జగన్ - చిరు భేటీ అనంతరం పొలిటికల్ ఫిల్లర్లను వదిలింది కూడా పీకే అని కొందరు అంటున్నారు.కానీ ఇదంతా అంత భావ్యంగా లేదని చాలా మంది వైసీపీ నాయకులే అంటున్నారు.కాపు సామాజికవర్గ నేతలను మచ్చిక చేసుకునే పద్ధతి ఇది కాదని అంటున్నారు.ఇలాంటివి చేయడం వల్ల మంచి కాస్త చెడుగా మారిపోతుందని చెబుతున్నారు.కనుక పీకే లాంటి వారు చిరు స్థాయి వ్యక్తుల విషయమై నోటికి వచ్చిందంతా లీక్ చేయడం తగని పని అని వైసీపీ నుంచే వినిపిస్తున్న మాట.