రూ. 20 లక్షలు ఇస్తే.. కోట్లు సంపాదించే మార్గం చెబుతా..?

Chakravarthi Kalyan
సైబర్ నేరాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. మీ కేవైసీ అప్‌డేట్ చేస్తామనో.. మీకు లోన్ ఇప్పిస్తామనే.. మీకు బహుమతి వచ్చిందనో.. ఫోన్లు చేస్తూ ప్రజలను బురిడీ కొట్టే సైబర్ నేరగాళ్లు ఎందరో ఉన్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి సైబర్ నేరాలు బాగా పెరుగుతున్నాయి. ఈ సైబర్ నేరాలు చేయడం చాలా ఈజీ.. ఓ ఫోన్‌ కాల్‌.. కాసిన్న మాటలు ఉంటే చాలు.. ఇట్టే డబ్బులు సంపాదించవచ్చని చాలా మంది యువత ఈ రూట్‌లో వెళ్తున్నారు.

మరికొందరు నాయకుల పేర్లు చెప్పి.. ప్రముఖల పేర్లు చెప్పి డబ్బు సంపాదిస్తుంటారు. చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఓ మోసగాడిని ఎంపీ పోలీసులకు పట్టించారు. ఈయన ఇలాంటలాంటి మోసగాడు కాదండోయ్.. మహా ఘరానా మోసగాడు.. ఎందుకంటే.. ఏకంగా ఎంపీకే ఫోన్‌ చేసి కేంద్రం నుంచి వచ్చే నిధులు మీకు చాలా ఉంటాయి. వాటిని సంపాదించుకోవడానికి మీకు సాయం చేస్తా అంటూ దగ్గరై కోట్లు కొల్లగొడదామనుకున్న వ్యక్తి గురించి ఎంపీ గురుమూర్తి తిరుపతి అర్భన్‌ ఎస్పీకి కంప్లయింట్ ఇచ్చారు.

ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తానంటూ తిరుపతి ఎంపీకి ఫోన్‌ చేసిన అభిషేక్‌ చేశాడట..   ఖాదీ పరిశ్రమల శాఖలో రాయితీ రుణాలు మంజూరు చేయిస్తానని నమ్మబలికాడట. ముందుగా రూ. 20 లక్షలు తన ఖాతాకు బదిలీ చేయాలని ఎంపీ గురుమూర్తిని అభిషేక్‌ అడిగాడట.. మీరు ఎంపీ కాబట్టి మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. అనేక పథకాల్లో మీరు 10 నుంచి 20 శాతానికి మించి కట్టేపని ఉండదు. మీకు అలాంటి పథకాల వివరాలు కావాలంటే చెప్పండని ఎంపీనే ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడట.

అంతే కాదు.. మీకు 20 యూనిట్లకు రాయితీపై రుణాలు మంజూరు చేయిస్తానని నమ్మబలికాడట అభిషేక్‌ అనే వ్యక్తి. అయితే ఇది నమ్మశక్యంగా లేదని గ్రహించిన ఎంపీ గురుమూర్తి.. ఈ యువకుడి నిర్వాహకంపై తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: