ట్రోలింగ్ వర్డ్ : పుష్ప
- ఎందుకని రెడ్డి సామాజికవర్గాన్నే
టార్గెట్ చేస్తారన్నది బాధిత వర్గం వాదన
- మంచి,చెడులన్నవి మనుషులవి
కులాలవి కాదు అని తెలుసుకోవాలని
హితవు...
పుష్ప సినిమాకు సంబంధించి ఓటీటీ స్ట్రీమ్ నడుస్తోంది.అమెజాన్ ప్రైమ్ లో విడుదలయిన (జనవరి ఏడున) ఈ సినిమా పై ఇప్పటికే అనేక ట్రోల్స్ నడుస్తున్నాయి.ఇవన్నీ ఓ సామాజికవర్గం చుట్టూ నడుస్తున్న వివాదానికి సంబంధించి ఉన్నాయి.కథ పరంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణకు,సామాజికవర్గాలకు ముడి పెట్టిన రీతికి ఏమయినా సంబంధం ఉందా అంటూ గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి.వీరికి వైసీపీ కూడా మద్దతుగా ఉంది.వాస్తవానికి తమ ఉద్దేశం అది కాదని వివరించే ప్రయత్నం ఒకటి ఇంతవరకూ సుక్కూ అండ్ టీమ్ అయితే చేయలేదు.గులాబీ శ్రేణులు మాత్రం తమ కోపాన్ని వెళ్లగక్కుతూనే ఉన్నారు.ఎందుకు ఇలా ఓ ప్రధాన సామాజికవర్గంలో మనుషులంతా విలన్లే అని చూపిస్తున్నారని? ఇలాంటివి విష సంస్కృతికి ఆనవాలు అవుతాయని ప్రశ్నిస్తూ.. తమ పోస్టులు రాసుకుంటూ వస్తున్నారు.
సినిమా అన్నది అన్ని సామాజికవర్గాలకు సంబంధించి ఉండాలి.. ఉంటుందని భావించాలి కూడా! విషాదం ఏంటంటే ఒక్క సామాజిక వర్గాన్నే టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందించారని ఒక వివాదం నడుస్తోంది.వాస్తవానికి సినిమా నిర్మాత నవీన్ ఎర్నేని చౌదరి కావడంతో సినిమాలో రెడ్డి సామాజికవర్గాన్ని టార్గెట్ చేశారని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.టీఆర్ఎస్ శ్రేణుల నుంచి కూడా విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా సినిమాలో విలన్ల పేర్లు రెడ్డి సామాజికవర్గంకు చెందినవిగా ఉన్నాయని,ఆ విధంగా కాకుండా పేరు చివర రెడ్డి తీసేసి సినిమా తీస్తే వచ్చిన నష్టమేంటని,ఓ సామాజికవర్గం ను కించపరిచే విధంగా సినిమాలు తీయడం సబబు కాదని అంటున్నారు టీఆర్ఎస్ యాక్టివిస్టులు.