ఆ జిల్లాలో వైసీపీ గెలుపు కష్టమే?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది తామే అంటూ చెప్పుకుంటున్నారు. అయితే గత పాలనలో ఇప్పుడున్న పాలనలో ఉన్న తేడాలను సరిగా అర్ధం చేసుకుని తీర్పును ఇవ్వాల్సింది మాత్రం ప్రజాదేవుళ్లే అని నాయకులూ మరిచిపోయినట్టున్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలలో వైసీపీ ఎమ్మెల్యే ల పని తీరు పట్ల ప్రజల నుండి వ్యతిరేకత వస్తోంది. కానీ జగన్ పై ఎంతో ఇష్టంతో ప్రజలు అంతా కూడా ఒక్క అవకాశం ఇద్దామని భావించి సీఎం ను చేశారు.

అయితే ఆ నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఒక్క సంక్షేమ కార్యక్రమాలు మినహా అభివృద్ధి చేసిన విషయం ఏమీ లేకపోవడమే ఒక పెద్ద మైనస్. ఈ ప్రభావం రాష్ట్రంలోని చాలా జిల్లాపై పడనుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ తిరుగుబాటు ఎలా ఉందంటే, జగన్ కు మరియు వైసీపీకి డై హార్డ్ ఫ్యాన్స్ అయిన వారు సైతం ఈ రోజు వైసీపీపై దారుణంగా విమర్శలు చేస్తున్నారు. కొత్తగా వేరు అయిన రాష్ట్రం పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అంటూ ఏపీ ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నారు.

ఇక నగర ఎమ్మెల్యే మరియు మంత్రి అయిన అనిల్ కుమార్ యాదవ్ నాయకత్వాన కొన్ని అవినీతి మరియు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సాక్షాత్తు వైసీపీ నాయకులే అంటున్నారు. ఈ సారి నగర ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తే ఓటమి తప్పదు అని ఇక్కడ ప్రజాగ్రహాన్ని చూస్తే తెలుస్తోంది.  ఈ విషయాలు అన్నీ తెలిసినా జగన్ ఊరకుండిపోయాడు. ఇక మిగిలిన రెండున్నరేళ్ల కాలంలో అభివృద్ధి పనులు జరగకపోతే ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు, ఏపీలో ఎక్కడా వైసీపీ గెలవడం కష్టం అని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఏమి జరుగుతుంది అనేది తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: