హ్యాపీ సండే : కమ్యూనిస్టు కేసీఆర్ కు రాయునది..
కానీ మరీ ఇంతటి అనూహ్యం అయితే..
జరగ వద్దు గాక వద్దు..జయహో కేసీఆర్!
కేసీఆర్ అంటే కమ్యూనిస్టు..కమ్యూనిస్టు అంటే హానెస్టు..హానెస్టు అంటే కేసీఆర్..ఇలాంటి నిర్వచనాలు వంద ఇచ్చుకోవచ్చు.కానీ కేసీఆర్ కు ఇవాళ తిరుగులేని ఆధిక్యం తెలంగాణలో ఉన్న కారణంగా ఆ కారణంతోనే దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కలిపి మిగతా ఉత్తరాది పార్టీలతో కలిసి, కొత్త కూటమి ఒకటి ఏర్పాటుచేయాలన్నది ఆయన కల.ఒకవేళ మధ్యంతరం తథ్యంతరం అని చెప్పారో మళ్లీ ఆ తరహా ప్రయత్నాలు ఒడ్డెక్కడం కూడా కష్టం.కనుక కేసీఆర్ ఇప్పటి నుంచే వామపక్షాలతోనూ ఇంకా ఇతర పార్టీల పెద్దలతోనూ కాస్తో కూస్తో దగ్గరగా ఉంటే మేలు.. ఒకసారి ఢిల్లీ రాజకీయాల్లో తిరుగాడిన అనుభవం ఉన్న కారణంగా ఈ సారి కేసీఆర్ పాత చేదును వదిలి కొత్త తీపిని పొందేందుకు, హస్తిన పురి దారుల్లో సత్తా చాటేందుకు సంసిద్ధం అవుతున్న ధోరణే సిసలు విశేషం.
గాయాలు మరిచి స్నేహాల కోసం...
వెళ్లడమే విడ్డూరం..కానివ్వవో!
ధర్నా చౌక్ రద్దు చేసినప్పుడు..పోలీసులతో విద్యార్థులను తన్నించినప్పుడు..నల్ల చట్టాల గురించి కొంతలో కొంత మాట్లాడకుండా ఉన్నప్పుడు మన కమ్యూనిస్టులకు అధికార పార్టీలంటే భలే కంపరం కానీ ఇప్పుడెందుకో ప్రేమ పుట్టుకువచ్చి కేసీఆర్ దగ్గరకు కేరళ సీఎం పినరయి విజయన్ ను తీసుకుని పోయారు.నిన్నటి వేళ సీపీఎం నేతలతో జరిగిన భేటీలో సీతారాం ఎచూరి అనే పెద్దాయన కూడా ఉన్నారులేండి.కనుక వస్తున్న పరిణామాలు అన్నీ మన మంచికే అని అనుకోవడం తప్ప ఇవాళ రాజకీయంలో కొత్త రక్తం ఆశించడం పెద్ద తప్పు.అపరాధం.అత్యాశ కూడా!
హద్దుల్లో ఉంటూనే..కలలకు రంగులు పులమండి..కేసీఆర్ కమ్యూనిస్టు ఎప్పుడయ్యారు.విచిత్రం.దేశ రాజకీయాల్లో ఏదో ఒక కూటమి ఏర్పాటు చేసి ఏనాటికో ఒక నాటికి సీఎం కేసీఆర్ కాస్తా పీఎం కేసీఆర్ కావాలన్నది ఆయన అభిమతం కావొచ్చు.కానీ అవన్నీ నెరవేరుతాయా.ఎందుకు నెరవేరుతాయి?కేసీఆర్ ను మించిన నాయకులు దేశ రాజధానిలో లేరా? లేకా మోడీని అంత సులువుగా దించెయ్యగలరా? కార్పొరేట్ శక్తుల అండ ఉన్నంత కాలం మోడీ తిరుగులేని శక్తిగానే ఉంటాడు. ఉండగలడు.అందుకే అంబానీ సోదరులను కూడా ఎన్నడూ దూరం చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటూనే ఉంటారు మోడీ..అలాంటప్పుడు మోడీ వైఫల్యం ఏముంటుందని?దేశ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్న మోడీని కేసీఆర్ కాదు కదా ఏ ప్రత్యామ్నాయ శక్తి ఇప్పట్లో ఓడించలేదు.ప్రత్యామ్నాయ శక్తుల బలం అయితే ఈ ఎన్నికల్లో కాస్తో కూస్తో పెరిగితే పెరగవచ్చు కానీ ఆయనను ఢీ కొనడం అన్నది జరగని పని.