ఉగ్ర‌వాదులు : దేశంలో దాడుల‌కు భారీ ప్లాన్‌.. సంక్రాంతి టార్గెటా..?

N ANJANEYULU
దేశంలో దాడులు చేయ‌డానికి ఉగ్ర‌వాదులు ప్లాన్ వేస్తున్నారా అంటే అవును అనే స‌మాధానం వ‌స్తుంది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు, రిప‌బ్లిక్ డే ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌దాడులు జ‌రుగ‌నున్నాయా..? అంటే ఇంటెలిజెన్స్ వ‌ర్గాల నుంచి అవును అనే స‌మాధానం వినిపిస్తుంది. ఇంటెలిజెన్స్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు దేశ రాజ‌ధాని న్యూఢిల్లీతో పాటు ఇత‌ర ప్రాంతాల‌లో ప‌లు ఉగ్ర‌దాడులు జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌ని, దీనికి అనుగుణంగా భ‌ద్ర‌తా ద‌ళాలు అప్ర‌మ‌త్తం కావాల‌ని తెలిపారు. పెద్ద స్థాయి నాయ‌కుల‌తో పాటు సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపుపై బాంబు దాడులు జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని పేర్కొంటున్నారు.  
అదేవిధంగా వీటితో పాటు ఉగ్ర‌వాదులు, జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న ప్ర‌దేశాలైన మార్కెట్లు, రైల్వే స్టేష‌న్లు, బ‌స్టాండ్లు,  మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల‌ను టార్గెట్ చేసుకున్నారు అని ఇంట‌లిజెన్స్ వ‌ర్గాలు హెచ్చ‌రిస్తూ ఉన్నాయి. ఈ త‌రుణంలోనే భద్ర‌తా ద‌ళాలు అలెర్ట్ కావాల‌ని, ఎయిర్‌ఫోర్ట్స్ లాంటి ప్ర‌దేశాల‌లో ఏదైనా దాడులు జ‌రిగితే వెంట‌నే స్పందించేవిధంగా యాక్ష‌న్ టీమ్‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు.
నిత్యం జ‌మ్మూకాశ్మీర్‌లో  ఎప్పుడు ఉగ్ర‌వాదులు చోర‌బ‌డ‌తారో తెలియ‌ని ప‌రిస్థితి ఉండ‌డంతో అక్క‌డ ఎప్ప‌టిక‌ప్పుడు భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మొహ‌రిస్తూ ఉగ్ర‌వాదుల కుట్ర‌ను భ‌గ్నం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంటాయి. తాజాగా ఇంటలిజెన్స్ వ‌ర్గాల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వ సీనియ‌ర్ అధికారి ఒక‌రు ప‌లు కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. భ‌ద్ర‌తా ద‌ళాలు అలెర్ట్ ఉండాల‌ని.. ముఖ్యంగా క్యాంపు ఏరియాల‌లో ఉండే వారు లోప‌ల‌, బ‌య‌ల విధుల స‌మ‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా ఉండేవిధంగా క్యాంపు ప్రాంతాల‌న్నీ నిఘాలో ఉంచాల‌ని సూచించారు. అదేవిధంగా ఆర్మీ క్యాంపులో తెలియ‌ని వ్య‌క్తుల‌ను  ఎట్టి ప‌రిస్థితుల్లో అనుమ‌తించ‌కూడ‌దు అని హెచ్చ‌రించారు. సీసీటీవీ కెమెరాల‌ను నిత్యం ప‌ర్య‌వేక్షించాల‌ని, డాగ్ స్క్వాడ్‌ల‌తో ప‌రిస‌ర ప్రాంతాల‌న్నింటినీ జ‌ల్లెడ ప‌ట్టాల‌ని సూచించారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ స‌మీపిస్తున్న త‌రుణంలో ఉగ్ర‌వాదులు ఆ స‌మ‌యంలో దాడుల‌కు పాల్పడే అవ‌కాశం కూడా ఉన్న‌ట్టు ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: