వాట్ ఐ యామ్ సేయింగ్ : డు డు బసవన్న పేటీఎం చేస్తా అన్నా!
ఏడాదికో సారి వచ్చే డు డు బసవన్న
అయ్యగారికి దండం పెట్టి అమ్మగారికి దండం పెట్టి
హాయిగా దీవెనలు అందించే బసవన్న
సంక్రాంతి వేళల్లో సందడికి నెలవుగా ఉండే
గ్రామాల్లో నగరాల్లో అన్నింటా ఆడి పాడే బసవన్నలు
వాటిని నడిపించే శ్రమ జీవి మాటలు ఇవన్నీ
ఏడాదంతా గుర్తుకువస్తాయి..ఏడాదికో సారి వచ్చి వెళ్తే..
అలాంటి బసవన్న డిజిటల్ వెర్షన్ తో సందడి చేస్తున్నాడు
పేటీఎం బోర్డులను మెడలో వేసుకుని ఆకట్టుకుంటున్నాడు
లోకమంతా అడ్వాన్సుగానే ఉంది.డబ్బులు ఇవ్వడంలోనూ,డబ్బులు పుచ్చుకోవడంలోనూ అలానే ఉంది.డిజిటల్ ఇండియాకు తెగ హైప్ తీసుకువచ్చిన మోడీ అదే ఊపుతో పేటీఎంకు,ఇతర యాప్ లకు తన నిర్ణయాలతో క్రేజ్ పెంచారు.దీంతో ఆన్ లైన్ పేమెంట్లు బాగా పెరిగాయి.నగదు రహిత లావాదేవీలూ పెరిగాయి.ఇవన్నీ కలిసొచ్చే విషయాలే కొన్ని కార్పొరేట్ కంపెనీలకు..! ఈ తరుణంలో గ్రామాల్లో కూడా వ్యాలెట్ పేమెంట్లకు చాలా అంటే చాలా గిరాకీ పెరిగింది.అప్పటిలా కాకుండా ప్రతి ఇంట్లో ఫోన్ పే ఇన్ స్టాల్ చేసుకుని హాయిగా స్మార్ట్ ఫోన్ల ద్వారానే నగదు లావాదేవీలు చేస్తున్న తీరుతో గంగిరెద్దులు ఆడించేందుకు వచ్చేవారు కూడా ఇదే సంస్కృతిని పాటిస్తున్నా రు. నగదు లేకుంటే పేటీఎం చేయవచ్చని ఆ విధంగా తమనూ,తమ కుటుంబాలనూ కాపాడాలని వేడుకుంటున్నారు...ఇవన్నీ ఇప్పుడు పల్లెల్లోనే కాదు నగరాల్లోనూ ఆకర్షణీయ విషయాలే అవుతున్నాయి.
సంక్రాంతి సందడికి ఇంకా వారం రోజులు టైం ఉంది.పల్లెల్లో,పట్టణాల్లో అంతటా ఇంకా పండగ సన్నాహాల్లోనే ఉన్నారందరూ! రెండేళ్లుగా కరోనా పుణ్యమాని ఎవ్వరూ బయటకు పోని విధంగా విభిన్నమయిన వాతావరణం ఒకటి నెలకొని ఉంది.ఆంక్షల నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు.కారణం కరోనా! ఈ సారి కూడా గత రెండేళ్లుగా మాదిరిగానే సంక్రాంతి పండుగ ఏ సందడీ లేకుండా ముగిసిపోతుందా అన్న భావన ఒకటి అందరిలోనూ నెలకొని ఉంది.అదృష్టం బాగుండి ప్రస్తుతానికి భయాలేవీ పెద్దగా లేవు.
చేసుకుంటున్నాయి.కనుక పండగ వేళ కొత్త బట్టల కళకళలు,పిండి వంటల సందళ్లు అన్నవి ఈ సారి పలకరించనుండడం ఖాయం. ఈ నేపథ్యం లో పల్లెల్లో,పట్టణాల్లో డు డు బసవన్నలు సందడి చేస్తున్నాయి.కొన్ని గంగిరెద్దులకు వినూత్నంగా పేటీఎం బోర్డులు తగిలించి మరీ! ఇళ్ల ఎదుట విన్యాసాలు చేస్తున్నారు సంబంధిత నిర్వాహకులు.దీంతో డిజిటల్ ఇండియాను విపరీతంగా వాడుకునేందుకు ఇష్టపడే వారికి ఈ గంగిరెద్దులు తెగ ఆకర్షిస్తున్నాయి.