ఏంట్రా ఇది : బూతులు తిట్టకురా కంట్రోల్ చేస్కోరా!
బూతులు మాట్లాడొద్దు అని చెబితే కోపం..అయినా కూడా చెప్పాల్సిందే..చెప్పాలనుకున్నది చెప్పకుండా ఉంటే ప్రజా స్వామ్యంకు అర్థమే లేదు.ఎవ్వరో ఒకరు ఏదో ఒక సమయంలో తగు రీతిలో ఆ భాషకు సమాధానం చెప్పే రోజు తొందర్లేనే ఉంది నానీగారూ! కంగారు పడకండి.. అన్నీ మీ మరియు మా మంచికే సర్!
ధరలను ఎవరు నియంత్రించాలి
సినిమా టిక్కెట్లను కాదండి
నిత్యావసరాలను ఎవరు నియంత్రించాలి
అన్నది కదా పాయింటు ఎవరు నియంత్రించాలి
పౌర సరఫరాల మంత్రికి ఎందుకీ రోషం మరియు పౌరుషం
భాష ఏ విధంగా ఉండాలో అన్నది వైసీపీకి ఎంత చెప్పినా అర్థం కాదు.ఓ మంత్రి ప్రజల్లో చులకన అయిపోతున్న ధోరణి ఒకటి ఎంతగా వార్తల్లో నిలిచినా ఆయనకూ, ఆయన అనుకూల వర్గాలకూ అస్సలు అర్థం కాదు.తిట్టి ఏం సాధిస్తారు.అభివృద్ధి చేసి అనుకున్నది సాధించవచ్చు కదా! అంటే వినిపించుకోరు.గతంలో టీడీపీ తిట్టే చాలా వరకూ తమపై నెగ్గుకు రావాలని చూసిందని,అదేవిధంగా ఇప్పుడు కూడా ఇదే ఫార్ములా పాటిస్తే తప్పేంటని వైసీపీ ఎదురు ప్రశ్నలు సంధిస్తూ, వింత వాదం ఒకటి వినిపిస్తోంది. ఈ తరుణంలో మరోసారి కొడాలి నాని నిన్నటి వేళ బూతులతో రెచ్చిపోయారు.చంద్రబాబును ఉద్దేశిస్తూ నానా మాటలూ అన్నారు.
కొంచెం అయినా సంయమనం లేకుండా
తిడుతున్నారు
ఇదెందుకు అక్కరకు వచ్చే విషయం
కనీస ఇంగితం అన్నది లేకుండా
మాట్లాడే మాటలే రేపటి మీ పతనంకు నాంది
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా విపక్షనేత చంద్రబాబును తిట్టని తిట్టు లేదు. కొడాలి నాని అనే మంత్రి వర్యులకు కొన్ని లాంగ్వేజ్ క్లాసెస్ చెప్పించాలి.అప్పుడయినా ఆయన మారుతారు అని, బుద్ధి మార్చుకుంటారని అనుకోవడంలో వింత లేదు కానీ ఆమోద యోగ్యత కానీ భాష వల్ల ఎవరికి ఉపయోగం.ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే వైసీపీని బదనాం చేసేందుకు కొడాలి అండ్ కో డ్రామా అని సాక్షాత్తూ ఆయన సొంత సామాజికవర్గం మనుషులే చాలా సందర్భాల్లో ఒప్పుకున్న దాఖలాలు ఉన్నాయి. అంటేఇప్పుడు ఆయన చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారా లేదా జగన్ కు అనుకూలంగా ఉంటున్నారా అన్నది తేలక వైసీపీ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.