అదిరిందెహే.. DRDO మరో అద్భుతం?
అదే సమయంలో లైట్ వెయిట్ యుద్ధ విమానం తేజస్ ను శాస్త్రవేత్తలు తయారుచేశారు అన్న విషయం తెలిసిందే. భారత రక్షణ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు తయారు చేసిన ఆయుధాలను కొనుగోలు చేసేందుకు ఇతర దేశాలు సైతం ముందుకు వస్తూ ఉండటం గమనార్హం. అయితే భారత్లో ఆయుధ తయారీని మరింత పెంచేందుకు.. భారత ప్రభుత్వం ఇతర దేశాలకు సంబంధించిన ఆయుధ తయారీ సంస్థలను భారత్లోకి ఆహ్వానిస్తోంది. ఇలాంటి సమయంలోనే డిఆర్డిఓ ఆయా కంపెనీలతో కలిసి వినూత్నమైన ఆయుధాలను తయారు చేయడానికి ముందుకు సాగుతోంది.
ఈ క్రమంలోనే ఇటీవల భారత రక్షణ పరిశోధన తయారుచేసిన లైట్ వెయిట్ యుద్ధ విమానం తేజస్ కు కొనసాగింపుగా ఇక ఇప్పుడు తేజస్ 2 తయారు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హెచ్ఏఎల్, ఎ డి ఎ, డిఆర్ డి వో లు సంయుక్తంగా తేజస్ మార్క్ 2 వర్షన్ ను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు drdo తయారుచేసిన లైట్ వెయిట్ యుద్ధ విమానం తేజస్ కంటే ఇది ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందట. షార్ట్ లాంగ్ రేంజ్ మిసైల్స్ తో పాటు బ్రహ్మోస్ మిస్సైల్, లేజర్ గైడ్ బాంబులను కూడా ఇది మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందట. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ యుద్ధ విమానం తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇది ఒక అద్భుత సృష్టి అని అంటున్నారు విశ్లేషకులు.