కృపారాణి : ఎడారి అనడం తప్పా ? కాదా? ఓవర్ టు అమరావతి
పొలిటికల్ సైన్స్ విత్ శంభుమహంతి..
స్థానికం నుంచి జాతీయం వరకూ
మాట్లాడేందుకు విశ్లేషణాత్మక దృశ్య సంబంధ
కథన రీతి..పచ్చని పంటలు విధ్వంసం అయితే
పచ్చని నేలలు విధ్వంసం అయితే
కృష్ణమ్మ నీళ్లతో తడిచిన నేలలు విధ్వంసం అయితే
ఎడారి అన్న పదం ఇవాళ వైసీపీ వినిపిస్తోంది
మరి ఆ రోజు ?
ఈ పదం తప్పు అని ప్రశ్నిస్తోంది..ఇలా పలకడం తప్పు అని చెబుతోంది..దీనిపై స్పష్టత కోరుతూ ఫ్రిలాన్స్ జర్నలిస్ట్, రైటర్ రత్నకిశోర్ శంభుమహంతి అడిగిన ప్రశ్నలకు కిల్లి కృపారాణి కొన్ని సమాధానాలు చెప్పారు..ఇవాళ ఆమెను కలిసిన సందర్భంగా శ్రీకాకుళం వైసీపీ కార్యాలయంలో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చి కూలంకుషంగా కొన్ని వివరాలు అందించారు.వాటిలో కొన్ని..
ముక్కారు పంటలు పండే నేలలు స్వాధీనం చేసుకుని ఆ రోజు అమరావతి నిర్మాణానికి పూనిక వహించారు అప్పటి సీఎం చంద్రబాబు.ఆ రోజు తీసుకున్న నిర్ణయం కారణంగా రైతులు భూ సమీకరణలో కొంత,సేకరణలో కొంత,స్వచ్ఛందంగా ఇంకొంత భూమిని ఇచ్చేందుకు ముందుకువచ్చి,రాజధాని నిర్మాణానికి సహకరించారు. అటువంటి సందర్భంలో రైతులు ప్రభుత్వాన్ని పూర్తిగా నమ్మి భూమి ఇచ్చి,రాజధాని అమరావతికి తమవంతు సహకారం అందించారు.ఆ రోజు వైసీపీ వాయిస్ ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం గడికోట శ్రీకాంత్ రెడ్డి లాంటి నేతల మాటలు మాత్రం భిన్నంగానే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షురాలు,కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి..పొలిటికల్ సైన్స్ విత్ శంభుమహంతి అనే కార్యక్రమంలో స్పందించారు.ఎడారి అనడం తప్పు కదా..ఎందుకలా అంటారు అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ.. ముక్కారు పంటలు పండే నేల ఇది అని మీరే అంటున్నారు..పచ్చని సిరులు జాలువారే నేల ఇది అని మీరే అంటున్నారు..అలాంటి నేలను ఎడారి చేసిన ఘనత చంద్రబాబుది అన్నది మా అభిప్రాయం..అని అన్నారామె..అలాంటప్పుడు చంద్రబాబు హయాంలో ఎడారిగా మారిందని అని అనాలి కానీ ఎడారి ఈ ప్రాంతం అని ఎలా అంటారు అని విలేకరి ప్రశ్నించగా,ఎవరు మాట్లాడినా ఆ మాట కలిపి మాట్లాడాల్సిందే..చంద్రబాబు కారణంగా ఈ విధంగా జరిగిందని చెప్పాలి..అని అన్నారామె.పచ్చని పంటలతో అలరారే ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఎడారిగా మార్చింది చంద్రబాబు అని కూడా అన్నారామె.ఆ ప్రాంతం ఎడారి కాదు ఎడారి చేసింది చంద్రబాబు..అని స్పష్టత ఇచ్చారు కిల్లి కృపారాణి.