జగన్ నాకే చుక్కలు చూపించాడు.. గొల్లుమన్న చంద్రబాబు..?

Chakravarthi Kalyan
కుప్పం నియోజక వర్గం.. మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం.. కొన్ని దశాబ్దాల నుంచి చంద్రబాబు అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనీసం నామినేషన్లు వేయడానికి కూడా చంద్రబాబు స్వయంగా అక్కడికి రాకపోయినా ప్రతిసారీ ఆయన్ను కుప్పం ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటూనే ఉన్నారు. అలా కుప్పం.. చంద్రబాబు అడ్డాగా మారింది. అయితే కొన్ని నెలలుగా కుప్పంలో సీన్ మారిపోతోంది. వైసీపీ కుప్పం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసింది. కుప్పం ను కొడితే చంద్రబాబును కొట్టినట్టే అన్నది జగన్ లాజిక్‌ కావచ్చు.


జగన్ సీఎం అయ్యాక.. చంద్రబాబును సొంత నియోజకవర్గంలో దెబ్బ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కుప్పంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. ఏకంగా 25 వార్డుల్లో 20కి పైగా గెలుచుకుని చంద్రబాబుకు సొంత నియోజక వర్గంలో చుక్కలు చూపించింది. అవి మున్సిపల్ ఎన్నికలే అయినా.. చంద్రబాబు సొంతనియోజక వర్గంలో అంత ఎక్కువ మార్జిన్‌తో వైసీపీ గెలువడం సాధారణం విషయం కాదు. అందకు ముందు జడ్పీటీసీ, ఎంపీటీసీ,  పంచాయతీ ఎన్నికల్లోనూ కుప్పంలో వైసీపీ  పైచేయి సాధించింది.


కుప్పంలో తనకు ఎదురైన అపజయాన్ని పాపం.. చంద్రబాబు కూడా మర్చిపోలేకపోతున్నారు. తాజాగా పార్టీ ప్రతినిధుల అంతర్గత భేటీలో చంద్రబాబు కుప్పం ఓటమి గురించి స్పందించినట్టు తెలిసింది. పార్టీలో పనిచేయలేని ఇన్‌ఛార్జులు ఉంటే పక్కకు తప్పుకోవాలని సూచించిన చంద్రబాబు
స్వచ్ఛందంగా తప్పుకుంటే కొత్తవారికి అవకాశం వస్తుందన్నారట. పనిచేయకుండానే పదవులు వచ్చేయాలని ఆశించకూడదన్న చంద్రబాబు.. టీడీపీకి తిరుగులేని కుప్పంలోనే వైసీపీ చుక్కలు చూపించిందని కామెంట్ చేశారట. కుప్పంలోనే ఇబ్బంది పెట్టారంటే మిగతాచోట్ల ఊహించవచ్చని చంద్రబాబు అన్నట్టు టీడీపీ అనుకూల మీడియాలోనే వార్తలు వచ్చాయి.


అందుకే పార్టీలో ఉంటూ నష్టం కలిగించే వారిని ఊపేక్షించనని.. వచ్చే ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావని.. రౌడీయిజం, విధ్వంసాన్ని తట్టుకుని నిలబడాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఢీ అంటే ఢీ అనే నాయకత్వమే ఇప్పుడు కావాలని చంద్రబాబు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: