క‌రోనా : కొత్త మందు.. మార్కెట్‌లోకి ఎప్పుడంటే..?

N ANJANEYULU
రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న త‌రుణంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారీకి భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఓవైపు క‌రోనా నుంచి కోలుకోక ముందే మ‌రొక వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో విజృంభిస్తుంది. క‌రోనా, ఒమిక్రాన్ వంటి వాటిని అరిక‌ట్ట‌డం కోసం ఇప్ప‌టికే కోవాక్సిన్‌, కోవీషీల్డ్ వంటి టీకాలు ప్ర‌వేశ‌పెట్టారు. అయితే తాజాగా భార‌తీయ ఫార్మాస్యూటిక‌ల్ కంపెనీ డాక్ట‌ర్ రెడ్డీస్ లాబోరేట‌రీస్ క‌రోనా కోసం కొత్త ఔష‌దాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ది. ఈ యాంటివైర‌ల్ క్యాప్సూల్ పేరు మోల్న్‌పిర‌విర్‌. ధీని ధ‌ర మ్యాన్ కైండ్ ఫార్మా క్యాప్సూల్ ధ‌ర‌తో స‌మానంగా ఉంటున్న‌ది. డాక్ట‌ర్ రెడ్డిస్ త‌న బ్రాండ్ పేరు మోల్ ప్లూతో క్యాప్సూల్‌ను విడుద‌ల చేయ‌బోతోంది.

 భార‌త‌దేశంలోని మొత్తం 13 కంపెనీలు మోల్న్ పిరావిర్‌ను త‌యారు చేయ‌నున్నాయి అని ఆరోగ్య‌మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వియా గ‌త వార‌మే ప్ర‌క‌టించారు. డాక్ట‌ర్ రెడ్డీస్ లాబోరెట‌రీ ప్ర‌కారం.. మోల్ ప్లూ ఒక్కో క్యాప్సూల్ ధ‌ర రూ.35గా ఉన్న‌ది. ఒక స్ట్రిప్‌లో 10 క్యాప్సూల్స్ ఉండ‌నున్నాయి. క‌రోనా పేషెంట్ 5 రోజుల్లో 40 క్యాప్సూల్స్ తీసుకోవాలి. దీనితో మొత్తం కోర్సు ఖ‌ర్చు రూ.1400 అవుతుంది. క‌రోనా రోగుల‌కు అందుబాటులో ఉన్న అత్యంత స‌ర‌మైన చికిత్స ఎంపిక‌ల‌లో ఇది ఒక‌టిగా నిలువ‌నున్న‌ది. యూఎస్ఎఫ్‌డీఏ ఆమోదించిన నిబంధ‌న‌ల‌తో మోల్ ప్లూ త‌యారు చేసారు.


వ‌చ్చే వారం నుండి ఇది మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్న‌ది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఫార్మ‌సీల‌లో అందుబాటులో ఉంటుందని డాక్ట‌ర్ రెడ్డీస్ తెలిపింది. ఈ సంవ‌త్స‌రం ప్రారంభంలో డాక్ట‌ర్ రెడ్డీస్ భార‌త‌దేశంతో పాటు 100 కంటే ఎక్కువ మ‌ధ్య‌-ఆదాయ దేశాల‌లో త‌యారీ, స‌ర‌ఫ‌రా చేయ‌డానికి నాన్‌-ఎక్స్‌క్లూజివ్ స్వ‌చ్ఛంద లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డాక్ట‌ర్ రెడ్డీస్‌తో పాటు 13 భార‌తీయ ఫార్మాస్యూటిక‌ల్ కంపెనీలు మ్యాన్‌కైండ్ ఫార్మా, టోరెంట్ ఫార్మా సిప్లా, స‌న్ ఫార్మా, నాట్కో, మైలాన్‌, హెటెరోతో స‌హా 13 భార‌తీయ ఫార్మాస్యూటిక‌ల్ కంపెనీలు ఈ మందును త‌యారు చేస్తూ ఉన్నాయి. ఎకాన‌మిక్ టైమ్స్ నివేదిక ప్ర‌కారం.. మ్యాన్‌కైండ్ ఫార్మా యాంటివైర‌ల్ క్యాప్సూల్ మోల్‌లైప్ ధ‌ర కూడా 35గా ఉన్న‌ది. మోల్న్‌పిరావిర్ తేలిక‌పాటి నుండి మిత‌మైన రోగుల‌కు చికిత్స చేసేందుకు ఆమోదించారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: