ఇంటికి ఒకే మీట‌ర్ వ‌ర్క‌వుట్ అయ్యేనా..?

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారం పెంచేందుకు ర‌గం సిద్ధ‌మ‌వుతుందా..?  ఇంటికొక మీట‌ర్ పెట్టాల‌నే నిబంధ‌న అమ‌లుపై ఏపీ రంగం సిద్ధం చేస్తుందా..?  దీనికి సంబంధించిన ఏవిధంగా అడుగులు వేయాల‌నే దానిపై క‌స‌ర‌త్తు చేస్తోంది. అయితే ఇది సున్న‌తిమైన వ్య‌వ‌హారం కావ‌డంతో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని భావిస్తుంది. ఇంటికి ఒకే మీట‌ర్ పెట్టుకోవాల‌ని మిగిలిన వాటిని తొల‌గించే దిశ‌గా ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు ఇంధ‌న శాఖ రంగం సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ త‌రుణంలో ఒక ఇంటికి ఒక‌టే మీట‌రంటే పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల నెత్తిన భారీగా భారం ప‌డ‌డం ఖాయం అనే భావ‌న అంద‌రిలో వ్య‌క్త‌మ‌వుతుంది. ఇంటికొక మీట‌ర్ అమ‌రిస్తే మూడు, నాలుగు పోర్ష‌న్ల‌కు సంబంధించిన బిల్లు ఒక‌దానిపై వ‌స్తే టారిఫ్ పెరిగిపోయి విద్యుత్ బిల్లులు రెండింత‌లవుతాయ‌నేది చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.
ఈ త‌రుణంలో ఇంటికొక మీట‌ర్ విధానం అంటే పోర్ష‌న్ కు ఒక మీట‌ర్ పెట్టుకోవాల‌నే నిబంధ‌న‌లు తాము అమ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్టుగా ఇంధ‌నశాక పేర్కొంటుంది. పోర్ష‌న్‌కొక మీట‌ర్ వేరు, ఇంటికొక మీట‌ర్ వేరు అని రెండింటిని విడివిడిగా చూడాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు. కొంత మంది విద్యుత్ వినియోగానికి త‌గ్గ బిల్లులు చెల్లించ‌కుండా ఉండేందుకు హై టారిఫ్ నుంచి త‌ప్పించుకునేందుకు ర‌క‌ర‌కాల జిమ్మిక్కులు చేస్తున్నార‌ని అధికారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కొంత‌మంది ఒక‌టికి మించి మీట‌ర్లు బిగించుకుంటున్నార‌ని ఫిర్యాదులు వ‌చ్చాయి. ఏసీలు, గీజ‌ర్లు వంటి వాటి ప్ర‌త్యేకంగా మీట‌ర్లు బిగించుకోవ‌డం వ‌ల్ల టారిఫ్లో బిల్లులు చెల్లించే వెసులుబాటు తీసుకుంటున్నారు. ఇది ప‌రిశీల‌న‌లో రుజువు కూడా అయిన‌ట్టు స‌మాచారం.
ఈ త‌రుణంలోనే ఒకే మీట‌ర్ విధానాన్ని అమ‌లు చేయాల‌ని, ఇది ఇంటికి కాదు అని పోర్ష‌న్‌కు మాత్ర‌మే అనేది ఇంధ‌న శాఖ ప్ర‌య‌త్నం చేస్తుంది. ఈ విధానానికి ప్ర‌స్తుతం బ్రేకులు ప‌డ్డా వాస్త‌వాలు వివ‌రించి నెమ్మ‌దిగా ఒకే మీట‌ర్ విధానాన్ని అమ‌లు చేసేందుకు క‌స‌రత్తు జ‌రుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది టారిఫ్ త‌గ్గించుకునేవిధంగా ఒక‌టిక‌న్నా ఎక్కువ‌గా మీట‌ర్లు పెట్టుకున్న‌వారి మాదిరిగానే ప్ర‌య‌త్నం కొన‌సాగుతోంది. ఇలా డేటా సేక‌రించి త‌రువాత  నెమ్మ‌దిగా అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు చేప‌డుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: