DRDO 'ప్రళయ్'.. ఇక చైనా తుక్కుతుక్కె?
ఒకవైపు విదేశాలనుంచి అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను భారత అమ్ములపొదిలో చేర్చడమే కాదు.. డి ఆర్ డి ఓ అభివృద్ధి చేస్తున్న ఎన్నో క్షిపణి వ్యవస్థలకు కూడా ప్రయోగాల నిర్వహించి భారత అమ్ములపొదిలో చేర్చుతుంది. అయితే ఇప్పటికే ఎన్నో రకాల మిస్సైల్ ని భారత రక్షణ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది అన్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు మరో మిస్సైల్ అభివృద్ధిలో కూడా డిఆర్డిఓ సక్సెస్ అయింది. ప్రళయ్ అనే కొత్త టాక్టికల్ మిస్సైల్ ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ కొత్త మిస్సైల్ చైనా కు వణుకు పుట్టిస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు.
సాధారణంగా మిస్సైల్ యుద్ధ సమయంలో ప్రయోగించిన తర్వాత ఒక నిర్దేశిత మార్గంలో వెళ్లి సశత్రు దేశాలపై దాడులు చేయడం చేస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతం డిఆర్డిఓ తయారుచేసిన మిస్సైల్ మాత్రం నిర్దేశిత మార్గంలో వెళ్లకుండా మార్గమధ్యంలోనే దిశ దశను మార్చుకుంటూ దాడి చేస్తుందట. ఈ క్రమంలోనే శత్రు దేశాలకు సంబంధించిన యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టం ను ఈ కొత్తరకం మిస్సైల్ ఎంతో తికమక పెట్టి సమర్థవంతంగా దాడి చేసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక శత్రు దేశాలకు సంబంధించిన మిసైల్ డిఫెన్స్ సిస్టం గుర్తించకపోవడంతో 100% కచ్చితత్వంతో దాడి చేస్తాయట. అయితే 150 నుంచి 500 కిలోమీటర్ల రేంజ్ లో ఇది దాడి చేయగలదట. కాగా ప్రస్తుతం సరిహద్దుల్లో ఉన్న చైనా స్థావరాలు మొత్తం ప్రళయ్ మిస్సైల్ రేంజ్ లోనే ఉన్నాయి అన్నది తెలుస్తుంది. దీంతో చైనాలో కూడా ప్రళయ్ మిస్సైల్ కారణంగా వణుకు పడుతుంది అన్నది అర్ధమవుతుంది.