బాబు జ‌గ‌న్‌ను కాపీ కొట్టేస్తున్నారుగా...!

VUYYURU SUBHASH
టీడీపీలో ఒక ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. పార్టీని ఆది నుంచి ఫాలో అవుతున్న యువ‌త‌కు ప్రాధాన్యం లేకుండా పోయింది. కేవ‌లం వారసులు మాత్ర‌మే యువ‌త‌గా ప‌రిగ‌ణించాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఇది పార్టీకి కూడా ఇబ్బందిగా మారింది. ఎందుకంటే.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌ని వార‌సులు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో టికెట్లు ప‌ట్టుకుపోతున్నార‌ని.. తాము నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నా.. ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోతోంద‌ని.. త‌మ‌ను కేవ‌లం వాడుకుని వ‌దిలేస్తున్నార‌ని.. దిగువ శ్రేణి నేతాగ‌ణం ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది.
అయితే..ఈ క్ర‌మంలో వార‌సుల‌ను ప‌క్క‌న పెట్టినా.. కేడ‌ర్ దెబ్బ‌తింటుంది. అలాగ‌ని వార‌సుల‌ను నెత్తిన పెట్టుకున్నా.. గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఫ‌లిత‌మే రిపీట్ అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని.. పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేసుకుని .. వ్య‌వ‌హ‌రించాల‌ని నేత‌లు భావిస్తున్నారు. అంటే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఎక్కువ మంది యువ‌త‌కు అవ‌కాశం ఇచ్చింది. అంటే.. 45-50 మ‌ధ్య వ‌య‌సున్న వారికి రాజ‌కీయాల‌తో పెద్ద‌గా సంబంధం లేకున్నా..కూడా.. అవ‌కాశం క‌ల్పించారు. టికెట్లు ఇచ్చారు.. వారిని గెలిపించుకున్నారు.
ఇలా.. టీడీపీలోనూ వ్య‌వ‌హ‌రిస్తే బెట‌రేమో.. అప్పుడు.. కొంతైనా వార‌సుల నుంచి బెడ‌ద త‌ప్పుతుంద‌ని అంటున్నారు. వాస్త‌వానికి వార‌సులు కావాల్సిందే. అయితే.. ఇప్పుడు పార్టీ కోసం వారు ఏమీ క‌ష్ట‌ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. చంద్ర‌బాబు రోడ్డు మీద‌కు వ‌చ్చినా.. వార‌సులుగా ఉన్నవారు మాత్రం క‌నిపించ‌డం లేదు. అదే స‌మ‌యంలో.. రాజ‌కీయాల‌తో సంబంధం లేనివారు జోరుగా ముందుకు సాగుతున్నారు.
ఈ క్ర‌మంలోనే.. వారికి టికెట్లు ఇవ్వ‌డం ద్వారా.. వైసీపీని టార్గెట్ చేసుకున్న‌ట్టు అవుతుంద‌ని.. తాము కూడా అంద‌రికీ అవ‌కాశం ఇచ్చామ‌నే వాద‌న‌ను టీడీపీ తీసుకువెళ్ల‌వ‌చ్చ‌ని.. కొంద‌రు సీనియ‌ర్లు అంటున్నారు. కానీ, ఇదే ఫార్ములా అనుస‌రిస్తే.. పార్టీలో తేడా వ‌స్తుంద‌నే ఆలోచ‌న కూడా ఉంది. వైసీపీలో ఉన్న క‌ట్టుబాటు.. క్ర‌మ‌శిక్ష‌ణ టీడీపీలో క‌నిపించ‌డం లేదని.. నేత‌లు రెబ‌ల్‌గా మారితే.. ఓట్లు చీలే ప్ర‌మాదం ఉంద‌ని.. టీడీపీ అంచ‌నావేస్తోంది.
అయితే.. అంత‌ర్గ‌తంగా మాత్రం పార్టీ కోసం ప‌నిచేస్తున్న వారిని కాపాడుకునే ఉద్దేశం అయితే.. ఉంది. కానీ, వైసీపీ చేసే సాహ‌సాలు మాత్రం చేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. అంటే.. ఇప్ప‌టికిప్పుడు.. ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నా.. అది దీర్ఘ‌కాలంంలో ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు. మ‌రి చివ‌ర‌కు చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: