
చంద్రబాబు ఆ నియోజకవర్గంపై ఫోకస్.!
దీంతో పంచాయతీ తేల్చుకునేందుకు మీటింగ్ ఏర్పాటు చేసిన పార్టీ సుప్రీమ్ చంద్రబాబు నాయుడు మాత్రం శంకర్ యాదవ్ పైనే నమ్మకం ఉంచడం వెనుక ఏం జరిగింది అనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. తంబళ్లపల్లి రాజకీయ పరిస్థితులు మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా ఉంటాయనే పేరుంది. కర్ణాటకకు సరిహద్దున వుండే తంబళ్లపల్లికి సీమలోని అనంతపురం, కడప జిల్లాలు కూడా అనుకునే ఉంటాయి. వంశపారంపర్య రాజకీయాలకు కేంద్ర బిందువుగా తంబళ్లపల్లి నిలుస్తూనే వస్తుంది. వచ్చే ఎన్నికల కోసం సమాయత్తమవుతున్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం పరిస్థితులపై చర్చించి కీలక నిర్ణయం తీసుకుంది.
ఆ ప్రక్రియలో భాగమే శంకర్ యాదవ్ ను పార్టీ ఇన్చార్జిగా కంటిన్యూ చేయడం, కండిషన్ ల మీద మీద పార్టీ ఇంచార్జ్ ను కొనసాగించడంపై చర్చ మొదలైంది. పార్టీ భవిష్యత్తుపై దృష్టి సారించిన తెలుగుదేశం హైకమాండ్ పెద్ద కసరత్తే చేసింది. మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో తంబళ్లపల్లి కి సంబంధించి తెలుగుదేశం అగ్రనేతలు, స్థానిక నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. తంబళ్ళపల్లి తెలుగుదేశం ఇన్చార్జి ఎవరైతే బాగుంటుంది అని తెలుసుకునేందుకు ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కళా వెంకట్రావు నేతృత్వంలోని పొలి బ్యూరో సభ్యులు తొలుత సమావేశమాయ్యారు.
పోలి బ్యూరో నేతల అభిప్రాయ సేకరణ తర్వాత శంకర్ యాదవ్ ను ఇన్చార్జిగా కంటిన్యూ చేస్తున్నట్టు ప్రకటించారు చంద్రబాబు. అయితే పార్టీ కార్యకర్తలపై అందుబాటులో ఉండకపోవడంపై యాదవ్ నుంచి వివరణ తీసుకున్న చంద్రబాబు మళ్లీ తప్పులు పునరావృతం అయితే బాగుండదని హెచ్చరించినట్లు టాక్ వస్తోంది. 3 నెలల్లో మార్పు చూపించాలని,లేకుంటే మరోసారి తంబళ్లపల్లి నేతలతో చర్చించి, ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుందని జాగ్రత్తలు చెప్పినట్టు తెలుస్తోంది.