హ్యాపీ సండే : మా విజీనగరం సింహానికి ఏమైంద్రా!
అంతేకాదు చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగివచ్చి విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా పేరొందారు. అంతేకాదు తనదైన శైలిలో అనుచరులనూ సిద్ధం చేశారు. ఈ క్రమంలో జిల్లాలో ఒక ఎంపీ స్థానంతో పాటు గజపతి నగరం, చీపురుపల్లి అసెంబ్లీ స్థానాలతో పాటు కాస్తో కూస్తో ఎస్ కోటను, ఇంకా తల్చుకుంటే అరకు ఎంపీ స్థానాన్నీ ఇంకా తల్చుకుంటే తనదైన శైలిలో విజయ నగరం అసెంబ్లీ సెగ్మెంట్ ను ప్రభావితం చేయగల నేత.
కానీ ఇప్పుడు ఆయనకు ఏమయింది. జగన్ కోటరీలో తన మాట నెగ్గడం లేదు. అదేవిధంగా ఆయన రిఫర్ చేసిన ఫైల్స్ ఏవీ సీఎంఓలో ఓకే కావడం లేదు. ఇంకా చెప్పాలంటే జగన్ అనే అధినేతకూ, బొత్స అనే అనుచరుడికీ మధ్య ఎప్పటి నుంచో ఉన్న దూరం ఇంకాస్త పెరిగి పెద్దదైంది. అయినా కూడా తన గాంభీర్యాన్ని పైపైకి చెప్పగలగడంలో అందుకు తగ్గ మాటలను వాడుకుంటున్నారే కానీ అసలు వివాదం మాత్రం లోలోపల ఉంది. కనుక విజయనగరం జిల్లా సింహం అయిన బొత్స ఇప్పుడు ఎలా ఉన్నారు అని ఆరా తీస్తే.. జఫర్ అనే జర్నలిస్టుకు దిమ్మదిరిగే ఆన్సర్లే నిన్నటి వేళ ఓ మీడియా ఇంటర్వ్యూలో వచ్చేయి.
మీరు అడవిలో సింహమా, సర్కస్ లో సింహమా అని అడిగిన ప్రశ్నకు ఏ మాటలండి అవి.. అడవిలో ఉన్నా, సర్కస్ లో ఉన్నా
సింహం సింహమేనండి అని తనదైన వాదన ఒకటి సమర్థింపు ధోరణి ఒకటి వినిపించారు. అయితే వాస్తవం మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నా విజీనగరం రాజకీయాల్లో ఆయన మాట చెల్లకున్నా, ప్రధాన అనుచరుడు మజ్జి శ్రీను తనదైన పావులు కదుపుతూ జెడ్పీచైర్మన్ గా ఎన్నికయిన నాటి నుంచి తన వర్గంకు బలం చేకూరుస్తున్నా ఇవేవీ తనకు చెప్పవద్దని పేర్కొంటూ బొత్స నిన్నటి వేళ అసహనం వ్యక్తం చేశారు. మరి! జగన్ కూ బొత్సకూ మధ్య వార్ లేనట్లే?