దిక్కున్న చోట చెప్పుకో.. అమెరికాకు వార్నింగ్?

praveen
ఒకప్పుడు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలలో ఒకటిగా కొనసాగింది రష్యా. కానీ ఆ తర్వాత మాత్రం వివిధ కారణాల వల్ల యూరోపియన్ యూనియన్ సభ్యత్వం వదులుకుంది. ప్రస్తుతం స్వతంత్ర దేశం గానే కొన సాగుతుంది రష్యా. అయితే గత కొంత కాలం నుంచి రష్యా కన్ను ఉక్రెయిన్ పడింది అన్న విషయం తెలిసిందే. యూరోపియన్ యూనియన్ సభ్యత్వం నుంచి తొలగించాలని రష్యా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. దీని కోసం ఏకంగా ఉక్రెయిన్ తో యుద్ధానికి దిగడానికి కూడా సిద్ధమై పోతుంది. సరిహద్దుల్లో భారీగా సైనికులను ఆయుధాలను సైతం మోహరించింది చైనా.

 ఇలాంటి పరిణామాల నేపథ్యం లో అటు అగ్ర రాజ్యాలైన రష్యా అమెరికా మధ్య గత కొంత కాలం నుంచి వివాదం కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ విషయం లో కలగ జేసుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని... తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ  అమెరికా హెచ్చరికలు జారీ చేస్తూ ఉండటం గమనార్హం. అదే సమయం లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. ఉక్రెయిన్  యూరోపియన్ యూనియన్ లో కలుపు కోవాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించింది.

ఇప్పుడు మరో సారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చిన స్టేట్మెంట్ కాస్త సంచలనం గా మారి పోయింది. ఓవైపు నాటో మరోవైపు యూరోపియన్ యూనియన్, ఇంకోవైపు అగ్ర రాజ్యమైన అమెరికా సైతం హెచ్చరికలు జారీ చేసిన అటు వెనక్కి తగ్గడం లేదు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ క్రమం లోనే ఇటీవలే ప్రెస్ మీట్ నిర్వహించిన రష్యా అధ్యక్షుడు.. సహనం కోల్పోయి మాట్లాడారు.. నాటో కెన్ గో టు హెల్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఇలాగే ముందుకు వెళ్తున్నాను.. దిక్కున్నచోట చెప్పుకోండి అన్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: