సినిమా రంగంపై మ‌న‌సు పారేసుకున్న ఏపీ మంత్రి

RATNA KISHORE
ప్ర‌స్తుతం మంత్రి అనీల్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. ప‌వ‌న్ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకే సినిమాల్లో న‌టిస్తున్నార ని ఓ విభిన్న వ్యాఖ్య ఒక‌టి చేసి  జ‌న‌సేన ట్రోలింగ్ కు గురి అవుతున్నారు. అంతేకాదు తాను ప‌వ‌ర్ స్టార్ అభిమానిని అని చెప్పి మ‌రో షాక్ ఇచ్చారు అనీల్. ఇవ‌న్నీ స‌రిపోక తాను కూడా ప‌వ‌న్ కోసం చాలా అమ్ముకున్నాన‌ని కూడా చెప్పి అభిమానుల‌కు పూన‌కాలు తెప్పించారు లేండి. అయినా ఆయ‌నేం మాట్లాడినా అదొక సెన్సెష‌న్.. మాట్లాడినా పోట్లాడినా అదొక వైబ్రేష‌న్. జ‌గ‌నన్న వీర విధేయుడిగా పేరున్న ఆయ‌న నెల్లూరులో ఓ పెద్ద లీడ‌ర్. పోల‌వ‌రం ప్రారంభించిన మంత్రి కూడా ఈయనే! సందేహం వ‌ద్దు ఆ ప్రాజెక్టు ఎప్పుడో పూర్త‌యిపోయింది. శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి నీళ్లొస్తున్నాయి కూడా! అంత బాగా ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చిన ఆయ‌న ఇప్పుడు సినిమా రంగంపై మన‌సు పారేసుకున్నారు.
అందుకే హీరోలు రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకుంటే చాలు సినిమా ప్రొడ‌క్ష‌న్ కాస్ట్ దానంత‌ట అదే త‌గ్గిపోతుంది అని అంటున్నారు. అంతేకాదు దేశ భ‌క్తి సినిమాలు రూపొందించిన వారికే ట్యాక్స్ మిన‌హాయింపులు ఇస్తాన‌ని  బంప‌ర్ ఆఫ‌ర్ కూడా ఇచ్చారు. ఇలా అయితే మంత్రిగారే సినిమా రంగంలోకి రావొచ్చు క‌దా అని జ‌న‌సైనికులు ఆహ్వానిస్తున్నారు.ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఇమేజ్ ప్ర‌కారమే ఎవ్వ‌ర‌యినా ఏ నిర్మాత అయినా నాలుగు డ‌బ్బులు ఇస్తారు. నాలుగు డ‌బ్బులు ఆ హీరోను అడ్డు పెట్టుకుని సంపాదించుకుంటా రు. అనీల్ మీరు ఈ నెల జీతం తీసుకోకండి ఆ డ‌బ్బులు తీసుకువెళ్లి సైనికుల స్మారక నిధికి ఇవ్వండి అని అంటే ఒప్పుకుంటారా?
అంటే మంత్రులు వ్యాపారాలు చేసుకోవ‌చ్చు కానీ ప‌వ‌న్ సినిమాలు చేసుకోకూడ‌దు..మంత్రుల‌తో స‌హా ముఖ్య‌మంత్రి కూడా వ్యాపారం చేసుకోవ‌చ్చు కానీ ప‌వ‌న్ మాత్రం సినిమాలు చేయ‌కూడ‌దు అన్న‌ది అనీల్ అన్న ఇచ్చిన రూలింగ్.. అని జ‌నసైనికులు వాపోతున్నారు. అయినా అనీల్ అన్న అనుకుంటే టాలీవుడ్ బ‌డ్జెట్  ను నియంత్రించ‌డం సాధ్య‌మే? అన్నా మీరు రావాల‌?!
 

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: