వైసీపీలో మూడుముక్కలాట.. రంగంలోకి మల్లెల పవన్ కుమార్ రెడ్డి ?
ఇక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎప్పటిలాగే జడ్పి ఉన్నత పాఠశాలలో కేక్ కటింగ్ తో పాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు నేతలు. నియోజకవర్గంలో మున్సిపాలిటీ మరియు మండలాల తో కలిపి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే. అయితే అటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి మరియు అనుచరులు పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. వీరందరూ ఒక ఎత్తు అయితే తాజాగా మూడో వ్యక్తి.. మల్లెల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఇ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు కూడా గ్రాండ్గా చేశారు. జిల్లాలో ఎవరు ఎన్నడు చేయనీ తరహాలో హెలికాప్టర్ లో జగన్ కటౌట్ పై పూలు చల్లాలని ప్లాన్ చేసి విఫలమై పోయారు. ఇక పవన్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ లో మూడు రౌండ్లు వేసి.. తిరిగి బెంగుళూరు వెళ్లారని సమాచారం.
ప్రత్యర్థి వర్గం అడ్డు పడటం కారణంగానే హెలికాప్టర్ కు అనుమతి లభించలేదని చెబుతున్నారు ఆయన అనుచరులు. ఇక బిటి కళాశాల మైదానంలో జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు నిర్వహించుకున్నారు ఆయన అనుచరులు. పార్టీలో స్థానిక ప్రజాప్రతినిధికి వ్యతిరేక వర్గం పవన్ కుమార్ రెడ్డి వెంట నడిచింది అని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా 2019 అసెంబ్లీ ఎన్నికల నుంచి మదనపల్లి నియోజకవర్గం పై కన్నేశారు పవన్ కుమార్ రెడ్డి. గత కొంత కాలంలో వైసీపీ పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ... అటు సీఎం జగన్కు అలాగే పెద్దిరెడ్డికి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా మదనపల్లిలో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయాలని మల్లెల పవన్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే శతవిధాల ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.