పవన్ : ఒకరికి అవసరం మరొకరికి వ్యసనం !
భీమ్లా నాయక్ సినిమా విడుదలను వాయిదా వేసి పవన్ కల్యాణ్ మరో సారి మంచి మనసు చాటుకున్నారు. దీంతో పవన్ పై అందరికీ ఉన్న సాఫ్ట్ కార్నర్ ఒక్కసారి పెరిగిపోయింది. ఇండస్ట్రీ బాగు కోసం తాను ఏం చేసేందుకు అయినా సిద్ధమేనని అన్న మాటకు పవన్ మరోసారి కట్టుబడి ఉన్నారు. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ లాంటి పెద్ద సినిమా విడుదల నేపథ్యంలో ఆ సినిమాకు మద్దతుగా తానుంటానని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రభాస్ రాధే శ్యామ్ కు కూడా తనవంతు బాధ్యతగా మద్దతుగా ఉండడం కూడా ఓ గొప్పవిషయం. పవన్ ఏ పనిచేసినా ఇండస్ట్రీలో సంచలనమే అవుతోంది అనేందుకు తాజా పరిణామాలే నిలువెత్తు నిదర్శనం. ఆ రోజు టికెట్ ధరల నియంత్రణకు సంబంధించి కూడా పవన్ మాత్రమే మాట్లాడారు. ఆయన మాత్రమే నిరసన తెలిపారు. బాహాటంగా ఏపీ సర్కారు నిర్ణయాలను ఎండగట్టారు. కానీ ఆరోజు ఆయన మాటకు అండగా చాలా మంది లేరు.