ఆ విగ్రహంతో వైశ్యులు శాంతిస్తారా?

RATNA KISHORE
రోశ‌య్య విగ్ర‌హం ఏర్పాటు చేస్తే
అస‌లు వివాద‌మేమీ ఉండ‌దు
కేకులు తినిపించి పంపిచేస్తే
అస‌లు రౌడీయిజం అన్న మాటే వినిపించ‌డం
జ‌ర‌గ‌ని పని! ఇలాంటివేవో చేస్తే ఆర్య వైశ్య సంఘం
అంతా రేప‌టి వేళ కూడా బాలినేనికి జై కొట్ట‌క త‌ప్ప‌దు


ఆర్య వైశ్య సామాజిక‌వ‌ర్గం పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. ఆ మాట‌కు వ‌స్తే  ఇక వారు పెద్ద‌గా రోడ్డెక్క‌న‌వ‌స‌రం కూడా రాదు. ఎవ్వ‌రు ఎవ్వ‌రితో అయినా మాట‌లు ప‌డాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. ఆ విధంగా వైసీపీ స‌ర్కారులో వారికి ప్రాణ ర‌క్ష‌ణ‌తో పాటు గొప్ప గౌర‌వం కూడా ఇచ్చేందుకు మంత్రి బాలినేని త‌న‌వంతు స‌న్నాహం చేస్తున్నారు. రౌడీలు న‌రికేస్తాం అన్నా కూడా భయ‌ప‌డ‌న‌క్క‌ర్లేదు. ఎందుకంటే వారు ఏం మాట్లాడినా పార్టీ అభిమానంలో భాగంగా మాట్లాడతారు అని మంత్రి బాలినేని చెబుతుంటారు. రౌడీల దాడులు కూడా పార్టీ పై అభిమానంతోనే ఉంటాయి. ఇక‌పై కూడా ఇలానే జ‌ర‌గ‌ద‌ని, జ‌ర‌గ‌నివ్వ‌ర‌ని ఏ మాత్రం భ‌రోసా ఇవ్వ‌లేం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వైసీపీ నాయ‌కులంటే వారి అనుచ‌రుల‌కు చంపేంత ప్రేమ.. ఆ ప్రేమ‌లో భాగంగానే ఇళ్ల‌పై దాడులు చేయ‌డం.. త‌ప్పు మాట్లాడితే అదేలేండి త‌మ‌కు అనుగుణంగా మాట్లాడ‌క‌పోతే ఓర్వ‌లేని గుణంతో ర‌గిలిపోవ‌డం వంటివి చేస్తుండ‌డం ఇవాళ ష‌రామామూలే!
ఒంగోలు వివాదంతో మంత్రి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి పూర్తి ఇర‌కాటంలో ప‌డిపోయారు. బాధితుడితో మాట్లాడి రాజీకి వ‌చ్చిన‌ప్ప‌టికీ స‌మ‌స్య అయితే ఇప్ప‌టిప్పుడు ప‌రిష్కారం కాదు. అందుకే బాధితుడు సుబ్బారావు గుప్తా త‌నకు గ‌న్ మేన్ స‌పోర్టు కావాల‌ని అంటున్నారు. మ‌రోవైపు రోశ‌య్య రుణం తీర్చుకునేందుకు విగ్ర‌హం ఏర్పాటుకు తాను సిద్ధ‌మేన‌ని చెబుతున్నారు. దీంతో ఆర్య వైశ్య సామాజిక‌వ‌ర్గం అంతా పూర్తిగా త‌గ్గిపోయార‌నే తెలుస్తోంది. త‌న‌కు రోశ‌య్య అంటే ఎంతో గౌర‌వం అని, ఆయ‌న సామాజిక‌వ‌ర్గం కు చెందిన ఆర్య వైశ్యులు ఎక్కడ స్థ‌లం సూచిస్తే అందుకు అనుగుణంగా కాంస్య విగ్ర‌హం ఏర్పాటు చేస్తాన‌ని ఆయ‌న అంటున్నారు. ఒక్క విగ్ర‌హం ఏర్పాటుతో స‌మ‌స్య మొత్తం ప‌రిష్కారం అయిపోయింద‌ని మంత్రి భావించ‌డం ఈ వివాదంలో కొస‌మెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: