రాయలసీమ: భువనేశ్వరిపై రోజా పంచ్ అదిరిందిగా
నారా భువనేశ్వరి స్టేట్మెంట్ పై నగిరి ఎంఎల్ఏ రోజా పంచ్ అదిరిపోయింది. తిరుపతిలో భువనేశ్వరి మాట్లాడుతు ‘ఆడవారిని ఏడిపించిన వారు వారి పాపాన వారే పోతారు’ అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయమై రోజా మాట్లాడుతు భువనేశ్వరి మాటలు అక్షరసత్యాలని అంగీకరించారు. మామూలుగానే చంద్రబాబునాయుడు, లోకేష్ విషయంలో రోజా రెచ్చిపోతుంటుంది. ఎవరిని విమర్శించాలన్నా, ఎవరిపైన ఆరోపణలు చేయాలన్నా ముందుండే రోజా పర్టిక్యులర్ గా చంద్రబాబు, లోకేష్ విషయంలో మాత్రం ఆకాశమే హద్దుగా రెచ్చిపోతుంటారు.
అందుకనే కాస్త డిఫరెంటుగా భువనేశ్వరి వ్యాఖ్యలకు కరెక్టు ఫిట్టింగ్ రిప్లై ఇచ్చారు. ఇదే విషయమై రోజా మాట్లాడుతు భువనేశ్వరి మాటలు నిజం కాబట్టే 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు పరిమితమైపోయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వల్లే భువనేశ్వరికి ఏదో ప్రమాదం పొంచి ఉందన్నారు. ఎన్టీయార్ ను ఏడిపించారు, తనను కూడా చంద్రబాబు ఏడిపించిన విషయాన్ని రోజా గుర్తుచేశారు.
చంద్రబాబు పాలనలో కాల్ మనీ కేసులో మహిళలు వ్యభిచారం చేయాల్సొచ్చిందంట రోజా మండిపోయారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. తనపై చంద్రబాబు అండ్ కో కక్షసాధింపులకు దిగినపుడు ఎందుకు నోరిప్పలేదని భువనేశ్వరిని రోజా సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో వనజాక్షిని జుట్టుపట్టుకుని కొట్టినపుడు, మహిళలను వివస్త్రలను చేసినపుడు కూడా భువనేశ్వరి ఎందుకు నోరిప్పలేదని రెచ్చిపోయారు. చంద్రబాబు హయాంలో మహిళలపై జరిగిన దాడుల గురించి అప్పట్లో భువనేశ్వరి ఒక్కమాట కూడా మాట్లాడకపోవటమే ఇపుడు రివర్సవుతోంది.