విశాఖ:- ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు తర్వాతే హైదరాబాద్ భౌగోళిక స్వరూపం మారిపోయిందని... నగరం విస్తరణ, అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డు అవసరమన్నారు tdp అధికార ప్రతినిధి పట్టాభి. అమరావతి రాజధాని, దాని చుట్టూ వున్న విజయవాడ,గుంటూరును కలుపుతూ 189కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు రూపకల్పన జరిగిందని.. 17761కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి కేంద్రం ఆమోదించిందని వెల్లడించారు. అటువంటి ప్రాజెక్ట్ ను
వైసీపీ ప్రభుత్వం అటకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు tdp అధికార ప్రతినిధి పట్టాభి.
ఓ.ఆర్.ఆర్.ను మంగళం పడేశారని కేంద్ర మంత్రి నీతిని గడ్కరీనే చెప్పారని మండిపడ్డారు tdp అధికార ప్రతినిధి పట్టాభి. ఫీజబులిటీ నివేదిక కూడా సిద్ధం చేశారు...రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే నిర్మాణానికి సిద్ధమని కేంద్రం చెప్పిందన్నారు tdp అధికార ప్రతినిధి పట్టాభి. ప్రభుత్వం మాత్రం 78కి.మీ విజయవాడ బైపాస్ ఇస్తే సరిపోతుందని చెప్పారని.. మంత్రి పేర్నినాని బ్లాక్ టిక్కెట్ మంత్రి అని మండిపడ్డారు tdp అధికార ప్రతినిధి పట్టాభి. బెంజ్, బెట్టింగ్ మంత్రులతో పాటు ఇప్పుడు బ్లాక్ టిక్కెట్ మంత్రి వచ్చాడని అగ్రహించరు tdp అధికార ప్రతినిధి పట్టాభి. పేర్నినానికి బైపాస్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి తేడా తెలియదని తెలిపారు tdp అధికార ప్రతినిధి పట్టాభి. విషయ పరిజ్ఞానం లేకుండా తాడేపల్లి ప్యాలెస్ లో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే ఎలా.... మీరు నిశానీ బ్యాచ్ అని అందరికీ తెలుసనీ అగ్రహించారు tdp అధికార ప్రతినిధి పట్టాభి.
పేర్ని నానీది నోరా తాటిమట్టా... హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు రూపకల్పన చేసింది చంద్రబాబా...?. రాజశేఖర్ రెడ్డా...!?. వాస్తవాలు తెలియకుండా మాట్లాడొద్దన్నారు. ఓ.ఆర్.ఆర్.ను రియల్ ఎస్టేట్ కోసం అష్టవంకర్లు తిప్పిన ఘనత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డును చెత్త బుట్టలో పడేసిందని పేర్ని నానీ నిస్సిగ్గుగా అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. భారత్ మాల కింద అమరావతి, విజయవాడ రింగ్ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం అని 2019లో రఘురామ కృష్ణ రాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిందన్నారు...