ఈట‌ల : బండితో విభేదాలు.. పార్టీ మార్పుపై క్లారిటీ..!

N ANJANEYULU
ఇటీవ‌ల హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు విభేదాలు త‌లెత్తాయ‌ని క‌రీంన‌గ‌ర్‌, ఆదిలాబాద్‌లో బీజేపీ అధిష్టానం వ‌ద్దనుకున్నా.. ఈటలనే ఎమ్మెల్యీ ఎన్నిక‌ల క్యాండిడేట్‌ల‌ను నిల‌బెట్టార‌ని వార్త‌లు వినిపించిన విష‌యం విధిత‌మే.  అదేవిధంగా  హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల కాంగ్రెస్‌లో చేరుతారు అన్న వార్త‌ల‌పై తాజాగా రాజేంద‌ర్ స్పందించారు. ఇవాళ ఓ హోట‌ల్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ప‌లు కీల‌క వ్యాక్య‌లు చేసారు.
ముఖ్యంగా తాను పార్టీలు మారే వ్య‌క్తిని కాద‌ని.. కాంగ్రెస్‌లోకి వెళ్లుతున్న‌ట్టు సీఎం కేసీఆర్ త‌ప్పుడు ప్ర‌చారాలు చేయిస్తున్నార‌ని ఆరోపించారు ఈట‌ల‌. అదేవిధంగా బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కు త‌న‌కు ఎలాంటి విభేదాలు లేవు అని.. గ్యాప్ లేద‌ని స్ప‌ష్టం చేసారు. కొంద‌రూ ప‌ట్టనివారు ఇలాంటి అస‌త్య‌పు ప్ర‌చారాల‌ను చేస్తున్నారు అని మండిప‌డ్డారు. తాను హుజూరాబాద్ నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అని, పార్టీ ఆదేశిస్తే సీఎం కేసీఆర్ పై  కూడా పోటీకి సిద్ధంగా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించారు ఈట‌ల‌. రాష్ట్ర ప్ర‌జ‌ల్లో టీఆర్ఎస్ నాయ‌కులు న‌మ్మ‌కం కోల్పోయారు అని పేర్కొన్నారు. కేవ‌లం ఎన్నిక‌లొచ్చిన‌ప్పుడు మాత్ర‌మే టీఆర్ఎస్‌కు డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు, నోటిఫికేష‌న్లు గుర్త‌కొస్తాయ‌ని ఎద్దేవా చేసారు.
 తెలంగాణ‌లో ధ‌ర‌ణి వ‌చ్చాక భూమి ఒక‌రిదైతే.. పేరు మ‌రొక‌రిది ఉన్న‌దని మండిప‌డ్డారు. ముఖ్యంగా మంత్రి లేకుండానే ఆశాఖ‌కు సంబంధించిన స‌మీక్ష‌ల‌న్ని ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోనే జ‌రుగుతున్నాయ‌ని.. భూముల మీద కేసీఆర్ అజ‌మాయిషీ కోస‌మే ధ‌ర‌ణి తీసుకొచ్చార‌ని పేర్కొన్నారు.  అసెంబ్లీ  ఎన్నిక‌ల‌కు మ‌రొక రెండేండ్ల స‌మ‌యం ఉంద‌ని.. అందుకే చాలా మంది ప్ర‌జాప్ర‌తినిధులు టీఆర్ఎస్‌లో కొన‌సాగుతున్నార‌ని.. భ‌విష్య‌త్‌లో బీజేపీ చేరే వారి సంఖ్య భారీగానే ఉంటుంద‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని ప‌త్రిక‌ల‌ను, మీడియా ఛాన‌ళ్ల‌ను ఆర్థికంగా దెబ్బ‌తీసేందుకు యాడ్స్ ఇవ్వ‌కుండా ఇబ్బంది పెడుతుంద‌ని  ఈట‌ల ఆరోపించారు. కేసీఆర్ కొన్ని మీడియా ఛానెళ్ల‌ను కొనేసి నిజాల‌ను దాచిపెడుతున్నారంటూ విమ‌ర్శ‌లు చేసారు ఈట‌ల‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: