పుష్ప : ఫర్ ఎ గుడ్ కాజ్..మా ఊళ్లో బంపర్ ఆఫర్ ?
సమాజానికో బాధ్యత నిండిన వ్యక్తులు కావాలి
ఆపద వేళల్లో ఆదుకునే శక్తి వారే కావాలి
అవును! రెండున్నర గంటల సినిమా ఇచ్చే సందేశం కూడా ఇదే
ఇందుకు అనుగుణంగా ఓ యువకుడి సంకల్పం ఇవాళ ఒక గొప్ప క్రతువుకు నాంది. రక్తదాన ఔన్నత్యాన్ని ఆవశ్యకతను గుర్తించి ఆయన చేసిన ప్రయత్నం కారణంగా ఎందరెందరో యువకులు స్ఫూర్తి పొందుతున్నారు. రేపు రిలీజ్ కానున్న పుష్ప సినిమా టి కెట్లను దాతలకు అందించి, ఇలాంటి మంచి సేవా కార్యక్రమంలో భాగం అయినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రాయన. సినిమా ఎందరో జీవితాలను నిలబెడుతుంది.. సినిమా ఎందరికో అండగా నిలుస్తోంది.. సినిమా కారణంగా సామాజిక బాధ్యత ఒకటి తప్పక వెల్లడి అయి నిర్వర్తింపునకు నోచుకుంటుంది...అనేందుకు ఓ తార్కాణం శ్రీధర్.. భయ్యా ! ఆల్ ద బెస్ట్..
సినిమాకో ప్రయోజనం సినిమా తీశాక ఓ లక్షణం ..సినిమా చూశాక ఓ ప్రయోజనం సినిమా చూసేందుకు కూడా ప్రయోజనం.. కావాలి...అవును! అందుకు శ్రీకాకుళం జిల్లా హిరమండలం హెల్పింగ్ హ్యాండ్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. పుష్ప ద రైజ్ సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో ఓ సామాజిక క్రతువుకు శ్రీకారం దిద్దింది. ఇవాళ (విడుదలకు ముందు రోజు) రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాతలకు వారు కోరుకున్నవిధంగా ఏదో ఒక షోకు పుష్ప సినిమా టికెట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. రేపటి వేళ హిరమండలం వరలక్ష్మి థియేటర్ లో ఈ సినిమా విడుదల కానుంది కనుక ఆ థియేటర్ లో ఏదో ఒక షో దాతలు తమకు నచ్చిన షో ఎంపిక చేసుకుని సినిమా చూసేందుకు వీలుగా టికెట్ అందించి, రక్తదానం ఆవశ్యకతను చాటుతోంది. ఈ విధంగా ఓ సినిమాకు సామాజిక ప్రయోజనం, ఓ సినిమాతో ఓ గొప్ప ఉద్యమం చేయాలన్న ఆలోచన వచ్చిన హెల్పింగ్ అసోసియేషన్ కార్య సారథి పోతురాజు శ్రీధర్ ను అంతా అభినందిస్తున్నారు. సాయంత్రం నాటి 30 నుంచి 50 యూనిట్ల రక్తం సేకరించి జిల్లా కేంద్రంలో న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంకుకు తరలిస్తామని చెప్పారు. తాము తలపెట్టిన కార్యక్రమానికి ఇతర హీరోల అభిమాన సంఘాల నుంచి కూడా మంచి స్పందన వస్తోందని, జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు కూడా తమ నిర్ణయాన్ని ప్రోత్సహిస్తూ అభినందిస్తున్నాయని ఆనందిస్తూ చెప్పారాయన.